Guntur Kaaram : ‘గుంటూరు కారం’ సంక్రాంతికి రాదా? మళ్ళీ షూటింగ్ వాయిదా..

మహేశ్ , పూజాహెగ్డే , శ్రీలీల కాంబినేషన్లో త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టార్ కాస్టింగ్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ మరోసారి స్లో అయ్యింది. ఇటీవల గ్లింప్స్ రిలీజ్ చేసి హైప్ ఇచ్చినా సినిమా షూటింగ్ మాత్రం జరగట్లేదు.

Guntur Kaaram : ‘గుంటూరు కారం’ సంక్రాంతికి రాదా? మళ్ళీ షూటింగ్ వాయిదా..

Mahesh Babu Guntur Kaaram Movie shoot postpone again fans disappointing and think movie will miss sankranthi release

Updated On : June 17, 2023 / 4:21 PM IST

Mahesh Babu : మహేశ్ బాబు, త్రివిక్రమ్(Trivikram) సినిమా మీద ఫ్యాన్స్ కి ఉన్న అంచనాలను డిజప్పాయింట్ చేస్తున్నారు టీమ్. ఎప్పుడెప్పుడు సినిమా షూట్ స్పీడప్ అవుతుందా..? ఎప్పుడెప్పుడు మహేశ్ ని సంక్రాంతి బరిలో చూద్దామా అని వెయిట్ చేస్తున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్ తెగ వర్రీ అవుతున్నారు. వెకేషన్ తర్వాత ఈ నెల నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తుందనుకున్న గుంటూరు కారం(Guntur Kaaram) మరో సారి షూట్ పోస్ట్ చేసుకుంది.

మహేశ్ , పూజాహెగ్డే , శ్రీలీల కాంబినేషన్లో త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టార్ కాస్టింగ్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ మరోసారి స్లో అయ్యింది. ఇటీవల గ్లింప్స్ రిలీజ్ చేసి హైప్ ఇచ్చినా సినిమా షూటింగ్ మాత్రం జరగట్లేదు. మహేశ్, త్రివిక్రమ్ సినిమా రోజురోజుకీ పోస్ట్ పోన్ అవుతోంది. ఇదిగో అదిగో అంటూ నెలరోజుల నుంచి మహేశ్ షూట్ పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. సమ్మర్ లో బ్రేక్ తీసుకున్న మహేశ్ ఫారెన్ నుంచి తిరిగి రాగానే జూన్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పారు మేకర్స్. కానీ ఇంకా మహేశ్ సెట్స్ మీదకి వచ్చిందే లేదు. షూటింగ్ ని స్పీడ్ చేసిందే లేదు.

ఇప్పటికే మార్చి, ఏప్రిల్ , మేలో ఇచ్చిన మిగతా ఆర్టిస్టుల కాల్షీట్స్ అన్నీ వేస్ట్ అయిపోవడంతో కొత్తగా డేట్స్ అడ్జస్ట్ చెయ్యడానికి తిప్పలు పడుతున్నారు టీమ్. గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుందని ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించారు. సంక్రాంతికి రిలీజ్ కావాలంటే ఇంకా 6 నెలలు మాత్రమే టైముంది. ఇంకా సినిమాకు సంబందించి మేజర్ సీన్స్ ఏం షూటింగ్ కంప్లీట్ కాలేదు. ఆల్రెడీ ఈ సినిమాలో ఉన్న మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నరు మేకర్స్. దీంతో షూట్ రోజురోజుకీ లేట్ అయిపోతూనే ఉంది.

Abhishek Ambareesh : సుమలత కుమారుడి రిసెప్షన్ విందు.. భోజనాల కోసం తోపులాట.. లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు..

ఇప్పటికే జూన్ ఫస్ట్ వీక్ లో స్టార్ట్ అవ్వాల్సిన షూట్ ఇప్పటికే 15 రోజులు డిలే అయ్యింది. ఈ 15 నుంచి షూట్ స్టార్ట్ చేస్తుందనుకున్న గుంటూరు కారం మళ్లీ నెలాఖరుకి వాయిదా చేసుకుంది. ఈ లెక్కన యాజ్ పర్ షెడ్యూల్ షూట్ కంప్లీట్ కాకపోతే మహేశ్, త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం సినిమాను సంక్రాంతి బరిలో దింపడం కష్టమే అని భావిస్తున్నారు ప్రేక్షకులు. మరి ఈ సినిమా ఫాస్ట్ గా షూట్ కంప్లీట్ చేసుకొని సంక్రాంతికి వచ్చి బాబు అభిమానులని ఖుషి చేస్తుందో లేదో చూడాలి.