Mahesh Babu Mother Funeral: మహాప్రస్థానంలో మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి అంత్యక్రియలు
సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి హఠాన్మరణంతో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అనారోగ్య కారణాల వల్ల ఇందిరా దేవి ఇవాళ వేకువజామున మృతి చెందారు. ఆమె మృతితో విషాదంలోకి వెళ్లిన కుటుంబ సభ్యులు, ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Mahesh Babu Mother Funeral To Be Held At Mahaprasthanam
Mahesh Babu Mother Funeral: సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి హఠాన్మరణంతో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మహేష్ ఎంతో ప్రాణంగా చూసుకునే తన తల్లి మృతిచెందడంతో ఆయన్ను ఓదార్చడం ఎవరితరం కాదని కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులు అంటున్నారు. అనారోగ్య కారణాల వల్ల ఇందిరా దేవి ఇవాళ వేకువజామున మృతి చెందారు.
Indira Devi: ఇందిరా దేవి మృతిపై చిరంజీవి.. సినీ ప్రముఖుల సంతాపం
కాగా, ఆమె మృతితో విషాదంలోకి వెళ్లిన కుటుంబ సభ్యులు, ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందిరా దేవి పార్ధీవదేహాన్ని ఘట్టమనేని కుటుంబ సభ్యులు, అభిమానుల సందర్శనార్థం పద్మాలయ స్టూడియోస్‌లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంచుతారు. ఆ తరువాత జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఇందిరా దేవి అంత్యక్రియలు నిర్వహిస్తామని మహేష్ బాబు కుటుంబ సభ్యులు తెలిపారు.
Mahesh Babu: ఒకే ఏడాదిలో మహేష్ ఇంట రెండు విషాదాలు..!
మహేష్ బాబుకు మాతృవియోగం కలగడంతో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్ ఆయనకు తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు. ఇందిరా దేవి మృతిపట్ల పలువురు రాజకీయ నాయకులు కూడా సూపర్ స్టార్ కృష్ణ కుటుంబానికి తమ విచారం వ్యక్తం చేస్తున్నారు.
నాన్-స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.