Mahesh – Namrata : 18 ఏళ్ళ పెళ్లి ప్రయాణం.. మహేష్, నమ్రతా ఎమోషనల్ పోస్ట్‌లు!

టాలీవుడ్ లో స్టార్ కపుల్ గురించి మాట్లాడుకోవాలి అంటే ముందుగా మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ పేరులే వినిపిస్తాయి. 2000లో వంశీ సినిమాతో మొదలైన వీరి ప్రేమ జీవితం, 2005లో ఎటువంటి హడావుడి లేకుండా చాలా సింపుల్ గా ముంబైలోని ఒక ప్రైవేట్ హోటల్ లో ఫిబ్రవరి 10న వివాహం చేసుకున్నారు. కాగా ఈరోజుతో..

Mahesh – Namrata : 18 ఏళ్ళ పెళ్లి ప్రయాణం.. మహేష్, నమ్రతా ఎమోషనల్ పోస్ట్‌లు!

Mahesh - Namrata

Updated On : February 10, 2023 / 11:04 AM IST

Mahesh – Namrata : టాలీవుడ్ లో స్టార్ కపుల్ గురించి మాట్లాడుకోవాలి అంటే ముందుగా మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ పేరులే వినిపిస్తాయి. మోడలింగ్ రంగంలో ప్రొఫెషనల్ కెరీర్ మొదలు పెట్టిన నమ్రతా.. హిందీ సినిమాలతో సినీ రంగానికి పరిచామయ్యి బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ వచ్చింది. 2000లో మహేష్ బాబు నటించిన ‘వంశీ’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది నమ్రతా. ఆ మూవీ షూటింగ్ సమయంలోనే మహేష్, నమ్రతా మధ్య ప్రేమ చిగురించింది. ఆ సినిమా పూర్తి అయిన తరువాత దాదాపు 5 ఏళ్ళ పాటు సీక్రెట్ గా డేటింగ్ చేస్తూ వచ్చారు ఈ ప్రేమ జంట.

Mahesh Babu : మళ్ళీ వెకేషన్‌కి చెక్కేస్తున్న మహేష్.. వైరల్ అవుతున్న మహేష్ లుక్స్!

2005లో అతడు మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎటువంటి హడావుడి లేకుండా చాలా సింపుల్ గా ముంబైలోని ఒక ప్రైవేట్ హోటల్ లో ఫిబ్రవరి 10న వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వీరిద్దరికి ఇద్దరు పిల్లలు.. గౌతమ్, సితార. కాగా ఈరోజుతో మహేష్, నమ్రతా పెళ్లి చేసుకొని 18 ఏళ్ళు అవుతుంది. దీంతో వారి బంధం గురించి సోషల్ మీడియా వేదిక ఎమోషనల్ పోస్ట్ లు వేశారు మహేష్ అండ్ నమ్రతా.

“మన బంధం కొంచెం క్రేజీ, అలాగే ప్రేమతో నిండినది. 18 ఏళ్ళగా ఇద్దరు కలిసి నడిచాం, ఎప్పటికి ఇలానే ఉందాం. హ్యాపీ యానివర్సరీ నమ్రతా” అంటూ తమ ఓల్డ్ ఫోటో పోస్ట్ చేస్తూ మహేష్ బాబు రాసుకొచ్చాడు. అలాగే నమ్రతా, మహేష్ బాబుని ముద్దు పెడుతున్న ఫోటోని షేర్ చేస్తూ.. “18 ఏళ్ళ క్రితం మేము తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని సెలెబ్రేట్ చేసుకుంటున్నాము. హ్యాపీ యానివర్సరీ మహేష్” అంటూ నమ్రతా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా వీరిద్దరూ ఈ యానివర్సరీని ఎంజాయ్ చేయడానికి నిన్న (ఫిబ్రవరి 9) వెకేషన్ కి చెక్కేశారు.

 

View this post on Instagram

 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)