Mahesh Babu : పైరసీ సైట్ ఐ బొమ్మకి మహేష్ ఫొటోతో యాడ్.. మరీ ఇలా వాడేసుకుంటారా??
గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపిస్తున్న పైరసీ సైట్ పేరు ఐ బొమ్మ. ఒకప్పుడు పైరసీ సైట్స్ అంటే తమిళ్ వాళ్ళే ఉండే వాళ్ళు. తమిళ సైట్స్ పేరు వినిపించేవి. కానీ ఐ బొమ్మ పక్కా తెలుగు వాళ్ళ సైట్. ఇందులో కేవలం తెలుగు సినిమాలు మాత్రమే.............

Mahesh Photo used for Ibomma Promotions
Mahesh Babu : ఏ సినీ పరిశ్రమకి అయినా పెద్ద సమస్య పైరసీనే. ఎన్నో సంవత్సరాలుగా పైరసీ మీద చిత్రపరిశ్రమలు పోరాడుతున్నా ఏదో ఒక రూపంలో పైరసీ సైట్స్ వస్తూనే ఉన్నాయి. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఎంత కంట్రోల్ చేసినా ఎప్పటికప్పుడు కొత్త రంగు పులుముకొని పైరసీ సైట్స్ వస్తున్నాయి. ఇటీవల సినిమా టికెట్ల రేట్లు పెరగడంతో జనాలు కూడా పైరసీ సైట్లకి బాగా అలవాటు పడ్డారు.
గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపిస్తున్న పైరసీ సైట్ పేరు ఐ బొమ్మ. ఒకప్పుడు పైరసీ సైట్స్ అంటే తమిళ్ వాళ్ళే ఉండే వాళ్ళు. తమిళ సైట్స్ పేరు వినిపించేవి. కానీ ఐ బొమ్మ పక్కా తెలుగు వాళ్ళ సైట్. ఇందులో కేవలం తెలుగు సినిమాలు మాత్రమే ఉంటాయి. చిన్న, పెద్ద తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇందులో దొరుకుతాయి. ఇక్కడ థియేటర్ ప్రింట్ ఉండవు. ఫుల్ HD క్వాలిటీలో ఉంటాయి. అంతేకాక ఇందులో డౌన్లోడ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ. దీంతో ఈ సైట్ కి జనాలు బాగా కనెక్ట్ అయ్యారు. ఐ బొమ్మ సైట్ కి విపరీతమైన ట్రాఫిక్ వచ్చి సైట్ బాగా పాపులర్ అయింది.
Mahesh Babu : సితారతో కలిసి మొదటిసారి టీవీలోకి వచ్చా.. మర్చిపోలేని జ్ఞాపకం.. మహేష్ స్పెషల్ ట్వీట్..
చేసేది పైరసీ అయినా ప్రమోషన్ మాత్రం బాగా చేసుకుంటారు ఈ సైట్ వాళ్ళు. క్వాలిటీ మ్యాటర్స్, ఫేక్ సైట్స్ ని నమ్మకండి అంటూ ప్రచారం చేస్తారు. ఇటీవల సైట్ ని మరింత డెవలప్ చేస్తాం, వేరే భాషల సినిమాలు కూడా పెడతాం అంటూ సైట్ లో పోస్ట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఓ యాడ్ పోస్టర్ రూపొందించారు. దీనికి మహేష్ బాబు ఫోటోని జత చేశారు. మహేష్ బాబు ట్యాబ్ పట్టుకొని ఐ బొమ్మలో వీడియోలు చూస్తున్నట్టు పోస్టర్ ని తయారు చేసి ప్రమోట్ చేస్తున్నారు. దీంతో ఇది చూసిన వారికి మహేష్ నిజంగానే ఐ బొమ్మకి యాడ్ చేశాడా అని అనుకుంటారు. కానీ ఒక్క క్షణం ఆలోచిస్తే అర్ధమవుతుంది ఇది వాళ్ళే క్రియేట్ చేసుకున్న ఫేక్ యాడ్ అని.
చేసేదే తప్పు పని, తెలుగు సినిమాలని పైరసీ చేస్తూ మళ్ళీ టాలీవుడ్ స్టార్ హీరో ఫోటోని ప్రమోషన్ కి వాడుకోవడం ఎంతవరకు కరెక్టో వాళ్ళకే తెలియాలి. ఈ సైట్ ని రెగ్యులర్ గా సినిమాల కోసం చూసేవాళ్ళు మహేష్ పోస్టర్ చూసి మహేష్ నిజంగానే దీనికి యాడ్ చేసాడేమో అనుకొని, మహేష్ పేరు దెబ్బతినే అవకాశం ఉంది. మరి ఇది మహేష్ వరకు చేరి దీనిపై ఎలాంటి చర్యలైనా తీసుకుంటాడేమో చూడాలి.