Mahesh Babu : సితారతో కలిసి మొదటిసారి టీవీలోకి వచ్చా.. మర్చిపోలేని జ్ఞాపకం.. మహేష్ స్పెషల్ ట్వీట్..

తాజాగా మహేష్ ఈ ప్రోగ్రాం ప్రోమోని షేర్ చేస్తూ స్పెషల్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ లో.. సితారతో కలిసి మొదటి సారి టీవీ షోలో కనిపించడం చాలా బాగుంది. గుర్తుండిపోయే జ్ఞాపకం ఇది. తప్పకుండా...........

Mahesh Babu : సితారతో కలిసి మొదటిసారి టీవీలోకి వచ్చా.. మర్చిపోలేని జ్ఞాపకం.. మహేష్ స్పెషల్ ట్వీట్..

Mahesh Babu Special Tweet on first tv experience with his daughter on a programme

Mahesh Babu :  ఇటీవల టెలివిజన్ షోలలో రెగ్యులర్ గా సినిమా స్టార్లు గెస్టులుగా వస్తున్నారు. స్టార్ హీరోలు సైతం అప్పుడప్పుడు టీవీ షోలలో స్పెషల్ అప్పీరెన్స్ ఇస్తారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా గతంలో కొన్ని టీవీ షోలలో కనిపించి అలరించారు. తాజాగా మహేష్ డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ అనే ఓ కొత్త షోకి గెస్టుగా వచ్చారు. అయితే ఈ సారి మహేష్ బాబు మాత్రమే రావడం కాకుండా సితారని కూడా తీసుకువచ్చారు. కొత్త షో డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ నుంచి తాజాగా మహేష్, సితార గెస్టులుగా వచ్చిన ప్రోమోని రిలీజ్ చేశారు.

ఈ ప్రోమోలో మహేష్, సితారలకి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఆ తర్వాత అక్కడున్న డ్యాన్సర్లతో సితార స్టెప్పులు వేసింది. మహేష్ ఈ షోకి సితారతో కలిసి రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఇందులో డ్యాన్స్ వేసిన ఓ ఇద్దరికీ మహేష్ తన తర్వాతి సినిమాలలో ఛాన్స్ ఇస్తా అన్నారు. కొన్ని కామెడీ పంచులు కూడా పేలాయి. ప్రోమో అద్భుతంగా కట్ చేయడంతో ఫుల్ ఎపిసోడ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఎపిసోడ్ నేడు ఆదివారం సెప్టెంబర్ 4న రాత్రి 9 గంటలకి ప్రసారం కానుంది.

Mahesh Babu : సితారతో కలిసి డ్యాన్స్ షోలో మెరిసిన మహేష్.. ఫుల్ ఖుషి అవుతున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్..

తాజాగా మహేష్ ఈ ప్రోగ్రాం ప్రోమోని షేర్ చేస్తూ స్పెషల్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ లో.. సితారతో కలిసి మొదటి సారి టీవీ షోలో కనిపించడం చాలా బాగుంది. గుర్తుండిపోయే జ్ఞాపకం ఇది. తప్పకుండా ఈ ఎపిసోడ్ చూడండి అంటూ కూతురితో పాటు తనకి గ్రాండ్ వెల్కమ్ చెప్పినందుకు ఆ ఛానల్ ని ట్యాగ్ చేస్తూ ధన్యవాదాలు తెలిపాడు మహేష్. దీంతో మహేష్ చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది.