Priyanka Chopra : రాజమౌళి – మహేష్ సినిమాలో ప్రియాంక చోప్రా రోల్ అదేనా..? నిజమేనా?

ఈ సినిమాలో ప్రియాంక చోప్రా నటిస్తుందని ఇండైరెక్ట్ గానే క్లారిటీ వచ్చేసింది.

Priyanka Chopra : రాజమౌళి – మహేష్ సినిమాలో ప్రియాంక చోప్రా రోల్ అదేనా..? నిజమేనా?

Mahesh Babu Rajamouli Movie Priyanka Chopra Role Rumors Goes Viral

Updated On : February 6, 2025 / 8:05 PM IST

Priyanka Chopra : సూపర్ స్టార్ మహేశ్ బాబు డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న మూవీపై అధికారికంగా అప్డేట్స్‌ రాకపోయినా ఏవో ఒక రూమర్స్ అయితే వస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు మూవీ ఓపెనింగ్‌ జరిగింది. షూటింగ్‌ కోసం ట్రాక్‌ కూడా ఎక్కబోతుంది. అయితే SSMB 29 సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతున్న టైంలో ఇప్పటివరకు మూవీ సబ్జెక్ట్ ఏంటి.? నటీనటులు ఎవరు.? ఆర్టిస్టుల గురించి చిన్న విషయం కూడా బయటకు రానివ్వకుండా చాలా జాగ్రత్త పడుతున్నాడు జక్కన్న.

కానీ ఈ సినిమాలో ప్రియాంక చోప్రా నటిస్తుందని ఇండైరెక్ట్ గానే క్లారిటీ వచ్చేసింది. SSMB29లో ప్రియాంక చోప్రా రోల్ ఏంటన్న దానిపై పెద్ద డిస్కషనే జరుగుతుంది. మహేశ్ బాబు సరసన హీరోయిన్‌గా చేస్తుందని కొందరు అంటుంటే మరొక మాట కూడా వినబడుతుంది. మహేశ్‌బాబు మూవీలో ప్రియాంక చోప్రా విలన్‌గా చేయబోతున్నట్టుగా సోషల్ మీడియాలో న్యూస్‌ వైరల్ అవుతోంది. మహేశ్‌ వర్సెస్ ప్రియాంక చోప్రా అన్నట్టుగా మూవీ ఉండబోతున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ప్రియాంక చోప్రా హైదరాబాద్‌లో ఉండటం అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ కూడా జరుగుతుండటంతో ప్రియాంక రోల్‌పై ఎన్నో గాసిప్స్ వినబడుతున్నాయి.

Also Read : Sai Pallavi : అబ్బాయిలు ఇలా డ్రెస్ చేస్తే సాయి పల్లవికి ఇష్టమంట.. సాయి పల్లవిని కలిసే ఛాన్స్ వస్తే ఇలా వెళ్ళండి..

ప్రియాంక చోప్రా విలన్ అయితే మరి హీరోయిన్ ఎవరన్న చర్చ జరుగుతోంది. రాజమౌళి తన ప్రతి సినిమా స్టార్ట్ చేసే ముందు ఆ సినిమా కథేంటో అందులో నటిస్తున్న నటీనటులెవరో మొత్తం చెప్తుండేవాడు. కానీ మహేష్ సినిమాకు మాత్రం రాజమౌళి చాలా సీక్రెసీ మెయింటెన్‌ చేస్తున్నాడు. యాక్షన్‌ అడ్వెంచర్‌గా తెరకెక్కనున్న మహేశ్‌, రాజమౌళి సినిమాపై చాలా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మూవీ యూనిట్‌ నుంచి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్‌ అనౌన్స్ మెంట్ రాలేదు. ఈ మూవీలో పలువురు విదేశీ నటులు యాక్ట్ చేయబోతున్నారట. ఇండియన్ లాంగ్వేజెస్‌తో పాటు విదేశీ భాషల్లోనూ ఈ మూవీ రిలీజ్‌కు ప్లాన్ జరుగుతుందంటున్నారు.

Also Read : Vishwak Sen : మా నాన్న చిరంజీవి తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసాడు.. బాస్ ఈజ్ బాస్.. విశ్వక్ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఇప్పటికే కొన్ని డేస్ రిహార్సల్స్ జరగ్గా త్వరలోనే రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రియాంక తన సోదరుని పెళ్లి వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. అది అయిన వెంటన్ షూటింగ్ మొదలుపెడుతారని సమాచారం. హైదరాబాద్ సెట్స్ లో కొన్నాళ్ళు షూట్ చేసాక కెన్యా అడవుల్లో షూటింగ్ చేస్తారని సమాచారం.