Hi Nanna : ప్రతి కూతురు కోసం నాన్న పాట.. అంటూ ‘హాయ్ నాన్న’ సాంగ్ రిలీజ్ చేసిన మహేష్ బాబు..
ప్రతి కూతురు కోసం నాన్న పాట అంటూ నాని ‘హాయ్ నాన్న’ సినిమాలోని సెకండ్ సింగల్ ని రిలీజ్ చేసిన మహేష్ బాబు.

Mahesh Babu released second single from Nani Hi Nanna
Hi Nanna : నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ కలయికలో తెరకెక్కుతున్న కొత్త మూవీ ‘హాయ్ నాన్న’. కొత్త దర్శకుడు శౌర్యువ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో రాబోతుంది. ఆల్రెడీ ప్రమోషన్స్ స్టార్ చేసిన ఈ మూవీ మేకర్స్.. ఇప్పటికే ఒక సాంగ్ ని రిలీజ్ చేసి మంచి రెస్పాన్స్ ని అందుకున్నారు. తాజాగా సెకండ్ సింగల్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశాడు. ప్రతి కూతురు కోసం నాన్న పాట అంటూ ‘గాజు బొమ్మ’ లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేశాడు.
ఈ సాంగ్ లో ఫాదర్ అండ్ డాటర్ మధ్య బాండింగ్ ని చూపించారు. నానికి కూతురిగా ‘బేబీ కియారా’ నటిస్తుంది. ఈ సినిమాకి మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ ‘హేశం అబ్దుల్ వహాబ్’ సంగీతం అందిస్తున్నాడు. మొదటి సాంగ్ లా ఈ పాట కూడా ఫీల్ గుడ్ మ్యూజిక్ తో ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా ఫాదర్ అండ్ డాటర్స్ కి ఈ సాంగ్ బాగా నచ్చేస్తుంది. కాగా ఈ మూవీ శృతిహాసన్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే మూవీ టీం నుంచి ఎటువంటి అధికారక ప్రకటన రాలేదు.
Also read : OTT – Theater Releases : ఈరోజు థియేటర్, ఓటీటీలో రిలీజ్ కాబోయే సినిమాలు, సిరీస్‌లు ఇవే..
From a father to his daughter, a song that will resonate with every dad, just like it did with me ♥️ #GaajuBomma!
Best wishes to the team!! #HiNanna
https://t.co/urBOIxWbip@NameisNani @mrunal0801 @shouryuv #BabyKiara @HeshamAWMusic @IananthaSriram @VyraEnts— Mahesh Babu (@urstrulyMahesh) October 6, 2023
కాగా ఈ మూవీని క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 21న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించారు. అయితే అదే సమయంలో ప్రభాస్ ‘సలార్’ కూడా వస్తుండడంతో.. హాయ్ నాన్నని పోస్టుపోన్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ రిలీజ్ డేట్ ని వెనక్కి కాకుండా ముందుకు తీసుకు రావాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. నవంబర్ లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ఈ మూవీ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. మరి నాని హాయ్ అంటూ ఎప్పుడు పలకరిస్తాడో చూడాలి.