Sudheer Babu: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అంటున్న మహేష్ బాబు..
తెలుగు తెరకు "SMS" చిత్రంతో పరిచయమైన హీరో సుధీర్ బాబు. తన వైవిధ్యమైన కథల ఎంపికతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు సుధీర్ బాబు ఇంద్రగంటి మోహన కృష్ణ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి".

Mahesh Babu releases Sudheer babu's Aa Ammayi Gurinchi Meeku Cheppali Trailer
Sudheer Babu: తెలుగు తెరకు “SMS” చిత్రంతో పరిచయమైన హీరో సుధీర్ బాబు. తన వైవిధ్యమైన కథల ఎంపికతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు సుధీర్ బాబు ఇంద్రగంటి మోహన కృష్ణ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”. ఈ చిత్రం ఈ నెల 16న విడుదల అవుతుండడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ లో వేగం పెంచాయి.
Mahesh Babu : పైరసీ సైట్ ఐ బొమ్మకి మహేష్ ఫొటోతో యాడ్.. మరీ ఇలా వాడేసుకుంటారా??
కాగా సుధీర్ బాబు, ఇంద్రగంటి మోహన కృష్ణ కలయికలో ఇది మూడో సినిమాగా రానుంది. కృతి శెట్టి సుధీర్ బాబుకు జంటగా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమ్మోహనం తరువాత వివేక్ సాగర్ మరోసారి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ బట్టి చూస్తే ఈ మూవీలో హీరో సుధీర్ బాబు సినిమా దర్శకుడి పాత్రలో, హీరోయిన్ కృతి కళ్ళ డాక్టర్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.
Mahesh Babu : సితారతో కలిసి మొదటిసారి టీవీలోకి వచ్చా.. మర్చిపోలేని జ్ఞాపకం.. మహేష్ స్పెషల్ ట్వీట్..
ఇక ఈ సినిమా ట్రైలర్ ని సోమవారం సాయంత్రం గం.5:04 నిమిషాలకు సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. సమ్మోహనంతో ఆకట్టుకున్న సుధీర్, ఇంద్రగంటి కాంబినేషన్ ఈ చిత్రంతో ఎంతవరకు ఆకట్టుకోగలదో వేచి చూడాలి.