SSMB28 : హాలిడే నుంచి తిరిగొచ్చిన మహేష్ బాబు.. SSMB28 షూటింగ్ అప్పటి నుంచే మొదలు..

హాలిడేకి స్పెయిన్ చెక్కేసిన మహేష్ బాబు హైదరాబాద్ తిరిగి వచ్చాడు. ఇక ఇక SSMB28 షూటింగ్ విషయానికి వస్తే..

SSMB28 : హాలిడే నుంచి తిరిగొచ్చిన మహేష్ బాబు.. SSMB28 షూటింగ్ అప్పటి నుంచే మొదలు..

Mahesh Babu return from vacation and SSMB28 shooting starts from june

Updated On : May 26, 2023 / 8:54 AM IST

Mahesh Babu SSMB28 : సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటిస్తున్న SSMB28 కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాయి. దీంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా చిత్రీకరణ మాత్రం చాలా మెల్లగా సాగుతుంది. ఆగష్టు రిలీజ్ వచ్చే ఏడాది జనవారికి వెళ్లడంతో టైం చాలా ఉందని మేకర్స్.. సినిమాని అందరి అంచనాలకు తగ్గట్టు రెడీ చేస్తున్నారు.

Rajamouli – Mahesh Babu : రాజమౌళి సినిమాలో మహేష్ హనుమంతుడి పాత్ర.. అమెజాన్ అడవుల్లో సాహసం!

ఇక గత నెలలో ఒక షెడ్యూల్ ని పూర్తి చేసిన చిత్ర యూనిట్ తదుపరి షెడ్యూల్ ఎప్పుడు అనే దాని పై ఒక క్లారిటీకి రాలేదు. దీంతో గత నెల చివరిలో మహేష్ బాబు స్పెయిన్ కి హాలిడే ట్రిప్ కి చెక్కేశాడు. తాజాగా ఆ వెకేషన్ నుంచి మహేష్ తిరిగి వచ్చేశాడు. హైదరాబాద్ లో ల్యాండ్ అయిన మహేష్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక SSMB28 షూటింగ్ విషయానికి వస్తే.. జూన్ మొదటి వారంలో ఈ మూవీ కొత్త షెడ్యూల్ మొదలు కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

The Kerala Story : సల్మాన్ మూవీని దాటేసిన ‘కేరళ స్టోరీ’.. పఠాన్ తరువాతి స్థానంలో..

జూన్ 5 నుంచి ఈ షెడ్యూల్ స్టార్ట్ అవ్వనున్నట్లు, దాదాపు మూడు నెలల పాటు ఈ షెడ్యూల్ షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా టైటిల్ అండ్ టీజర్ గురించి కూడా ఆసక్తికర న్యూస్ వినిపిస్తుంది. ‘గుంటూరు కారం’, ‘అమరావతికి అటు ఇటు’ అనే టైటిల్స్ ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు (మే 31) సందర్భంగా రీ రిలీజ్ అవుతున్న ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమాతో పాటు SMMB28 టీజర్ ని ప్రదర్శించి టైటిల్ ని రివీల్ చేయనున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాలో పూజా హెగ్డే (Pooja Hegde), శ్రీలీల (Sreeleela) హీరోయిన్స్ గా నటిస్తున్నారు.