Mahesh Babu : ‘బిజినెస్ మేన్’ టైంలో మహేష్ ఆ ప్రయోగం చేశాడట.. కానీ వర్క్ అవుట్ అవ్వక.. ఏంటది?
మహేష్ బాబు 'బిజినెస్ మేన్' మూవీ టైంలో ఆ ప్రయోగం చేశాడట. కానీ అది వర్క్ అవుట్ అవ్వక వదిలేశారట. ఇంతకీ అదేంటో తెలుసా..?
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు, మాస్ డైరెక్టర్ పూరీజగన్నాధ్ కాంబినేషన్ కి టాలీవుడ్ లో ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. వీరిద్దరి కలయికలో వచ్చిన మొదటి సినిమా ‘పోకిరి’ ఇండస్ట్రీ హిట్ అందుకొని ఒక ప్రభంజనం సృష్టించింది. ముఖ్యంగా ఆ మూవీలోని పంచ్ డైలాగ్స్ ఆడియన్స్ కి కిక్ ఇచ్చాయి. ఆ తరువాత వీరిద్దరూ కలిసి చేసిన సినిమా ‘బిజినెస్ మేన్’ (Businessman). ముంబై గ్యాంగ్ స్టార్స్ నేపథ్యంతో క్రైమ్ యాక్షన్ మూవీగా వచ్చిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది.
Sai Dharam Tej : యాక్టర్ నరేష్ కొడుకు దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ సినిమా.. మీకు తెలుసా..?
ఇక ఈ చిత్రంలో కూడా పూరి అండ్ మహేష్.. ఓ రేంజ్ పంచ్ డైలాగ్స్ పేల్చి థియేటర్స్ రీ సౌండ్ వచ్చేలా చేశారు. అయితే ఈ సినిమా సమయంలో మహేష్ బాబు ఒక చిన్న ప్రయోగం చేశాడట. కానీ అది వర్క్ అవుట్ లేదట. ఈ సినిమాకి థమన్ సంగీతం అందించిన విషయం అందరికి తెలిసిందే. టాలీవుడ్ లోని చాలా మంది హీరోలతో థమన్ సినిమాల్లో పాటలు పాడించాడు. అలాగే బిజినెస్ మేన్ టైంలో కూడా మహేష్ తో ఒక సాంగ్ పాడించడానికి ట్రై చేశాడు. దాదాపు రెండు గంటలు పాటు ప్రత్నించారట.
Bhagavanth Kesari : బాలయ్య ‘భగవంత్ కేసరి’ హరికృష్ణ సినిమా రీమేకా..? అసలు నిజం ఏంటంటే..?
మహేష్ బాబుకి కుదరకపోవడంతో తానే వద్దని చెప్పేశాడట. అయితే థమన్.. కనీసం కొన్ని డైలాగ్స్ అన్న చెప్పండి అంటూ బలవంతం చేయడంతో ఆ సాంగ్ లో డైలాగ్స్ రూపంలో మహేష్ గొంతు వినిపిస్తుంది. బిజినెస్ మేన్ థీమ్ సాంగ్ ‘బాగ్ సాలే’ సాంగ్ లో మహేష్ గొంతు వినిపిస్తుంది. ఈ విషయాన్ని మహేష్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. కాగా బిజినెస్ మేన్ ఇటీవల మళ్ళీ రీ రిలీజ్ అయ్యి థియేటర్ లో సందడి చేసింది. సూర్య భాయ్ గా మహేష్ చెప్పే డైలాగ్స్ ని ఆడియన్స్ మరోసారి థియేటర్స్ లో ఎంజాయ్ చేశారు.
View this post on Instagram