Mahesh Babu : ఇంగ్లాండ్ దంచుడుకు మహేశ్ బాబు ఫిదా.. నవశకానికి నిదర్శనం అంటూ..
క్రికెట్‌లో యాషెస్ సిరీస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంగ్లాండ్ ఆడిన విధానానికి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం ఫిదా అయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా చేశారు.

Mahesh Babus Interesting Post
Mahesh : క్రికెట్‌లో యాషెస్ సిరీస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే ఈ సిరీస్ క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరిస్తూ ఉంటుంది. ప్రపంచకప్ గెలవకున్నా పర్వాలేదు కానీ యాషెస్ సిరీస్‌ను ఖచ్చితంగా గెలవాల్సిందేనని ఇరు దేశాల అభిమానులు కోరుకోవడం ఈ సిరీస్‌కు ఉన్న క్రేజ్‌కు అద్దం పడుతుంది. ఐదు టెస్టుల యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా శుక్రవారం నుంచి తొలి టెస్టు ప్రారంభమైంది.
కోచ్‌గా మెక్‌కల్లమ్, టెస్టు కెప్టెన్‌గా బెన్‌స్టోక్స్ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఇంగ్లాండ్ బజ్‌బాల్ విధానాన్ని అనుసరిస్తోంది. దూకుడే మంత్రంగా ఆడుతున్నారు. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో సైతం అదే వ్యూహాన్ని అనుసరించింది ఇంగ్లీష్ జట్టు. మొదటి టెస్టు తొలి రోజున ధనాధన్ ఆటతో ఆస్ట్రేలియాపై పై చేయి సాధించింది. తొలి రోజే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఇంగ్లాండ్ ఆడిన విధానానికి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం ఫిదా అయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా చేశారు.
‘‘393-8 డిక్లేర్డ్.. నేను సరిగ్గానే చదువుతున్నానా. వావ్.. జస్ట్ వావ్. క్రికెట్‌లో నవ శకానికి ఇదే నిదర్శనం.. బజ్‌బాల్’’ అంటూ ట్వీట్ చేశాడు. మహేశ్ బాబుకు క్రికెట్ అంటే ఇష్టం అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
393-8 d… Am I reading this right… Wow… Just wow… Witnessing a new era of Cricket… Bazball ???#ENGvsAUS #Ashes2023
— Mahesh Babu (@urstrulyMahesh) June 16, 2023
Adipurush : ఆదిపురుష్ హనుమాన్ డైలాగ్స్ పై వివాదం.. నేనేమి తప్పుగా రాయలేదు అంటూ స్పందించిన రైటర్..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి టెస్టులో అదిరే ఆరంభాన్ని సొంతం చేసుకుంది ఇంగ్లాండ్. జో రూట్ (118 నాటౌట్; 152 బంతుల్లో 7ఫోర్లు, 4సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా, బెయిర్‌స్టో (78; 78 బంతుల్లో 12ఫోర్లు), క్రాలీ (61; 73 బంతుల్లో 7ఫోర్లు) అర్ధశతకాలతో రాణించడంతో తొలి రోజున నే మొదటి ఇన్నింగ్స్‌ను ఇంగ్లాండ్ 393/8 వద్ద డిక్లేర్ చేసింది. ఆసీస్ బౌలర్లలో స్పిన్నర్ నాథన్ లియోన్ నాలుగు వికెట్లు తీయగా, హేజిల్ వుడ్ రెండు, గ్రీన్, బొలాండ్‌లు చెరో వికెట్ పడగొట్టారు.