Bigg Boss OTT 2 : నేటి నుంచే ప్రారంభం.. కంటెస్టెంట్స్ వీళ్లేనా..? స్ట్రీమింగ్ ఎక్క‌డంటే..? సన్నీ లియోనీ కూడా..

బిగ్‌బాస్ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. దేశ వ్యాప్తంగా ఈ షోకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇక హిందీ బిగ్‌బాస్ కోసం ఎంతో మంది ఎదురుచూస్తుంటారు

Bigg Boss OTT 2 : నేటి నుంచే ప్రారంభం.. కంటెస్టెంట్స్ వీళ్లేనా..? స్ట్రీమింగ్ ఎక్క‌డంటే..? సన్నీ లియోనీ కూడా..

Salman Khan-Sunny Leone

Updated On : June 17, 2023 / 4:45 PM IST

Bigg Boss OTT Season 2 : బిగ్‌బాస్ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. దేశ వ్యాప్తంగా ఈ షోకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇక హిందీ బిగ్‌బాస్ కోసం ఎంతో మంది ఎదురుచూస్తుంటారు. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 16 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. ఓటీటీల హ‌వా మొద‌లైన నేప‌థ్యంలో గ‌త ఏడాది నుంచి ఓటీటీలో కూడా ఈ షోను ప్రారంభించారు. మొద‌టి సీజ‌న్‌ స‌క్సెస్ పుల్‌గా పూర్తి కాగా.. నేటి(జూన్ 17) నుంచి రెండో సీజ‌న్ ఆరంభం కానుంది.

ఎక్క‌డ చూడాలి..?

బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ 2 షోకు సల్మాన్ ఖాన్ హెస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. శ‌నివారం రాత్రి 9 గంట‌ల నుంచి జియో సినిమా(JioCinema) లో మల్టిపుల్-క్యామ్ యాక్షన్‌తో స్ట్రీమింగ్ కానుంది. ఈ షోని ఉచితంగా చూడొచ్చున‌ని జియో సినిమా ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది.

Chiranjeevi : మెగాస్టార్ నెక్స్ట్ సినిమాలు ఇవేనా..? ఆ డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇచ్చాడా?

పోటీదారుల్లో కొంద‌రు

బిగ్‌బాస్ ఓటీటీ సీజన్‌ 2లో ఎవరెవ‌రు పాల్గొంటున్నారు అన్న విష‌యంలోకి వ‌స్తే.. ఆలియా సిద్దిఖి, మనీషా రాణి, ఆకాంక్ష పూరి, పలక్ పురస్వాని, అవినాష్ సచ్‌దేవ్, జియా శంకర్, ఫలక్ నాజ్, సైరస్ బ్రోచా, జద్ హదీద్, బేబికా ధ్రువే తదితరులు ఉన్నారు. మ‌రికొంద‌రి పేర్లు తెలియాల్సి ఉంది. వీరిలో ఆలియా సిద్దిఖి ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ మాజీ భార్య అన్న సంగ‌తి తెలిసిందే. అభిప్రాయ భేదాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు.

షోలో కొత్త ఫీచ‌ర్లు ఇవే..

బిగ్‌బాస్ ఓటీటీ మొక్క కొత్త సీజ‌న్‌ను ప్రేక్ష‌కుల‌కు మ‌రింత చేరువ చేసేందుకు జియో సినిమా కొత్త ఫీచ‌ర్ల‌ల‌ను ప‌రిచ‌యం చేస్తోంది. JioCinemaలో బిగ్ బాస్ OTT సీజన్ 2 స్ట్రీమింగ్ లైవ్ ఇంటరాక్టివిటీ ఎంపికను కలిగి ఉంది. ఇది వీక్షకులు హౌస్‌మేట్స్‌తో ఇంటరాక్ట్ అయ్యేలా చేస్తుంది. వారంవారీ రేషన్, స్పాట్ ఎలిమినేషన్‌లు, టాస్క్ నిర్ణయాలకు సంబంధించిన ఫలితాలను రూపొందించగల సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు. మ‌ల్టీపుల్ కెమెరా స్ట్రీమింగ్ అందిస్తోంది. విభిణ్న దృక్కోణాలలో ఒక్క క్ష‌ణం కూడా అంత‌రాయం లేకుండా చూసేందుకు వీలుంది.

Salman Khan : స‌ల్మాన్ ఖాన్‌, వెంక‌టేశ్ న‌టించిన సినిమా ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది.. ఏ రోజునంటే..?

స‌ల్మాన్ ఖాన్ ఏమ‌న్నాడంటే..?

బిగ్‌బాస్ ఓటీటీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. భార‌త దేశం ఎల్ల‌ప్పుడూ నాన్ స్టాప్ ఎంట‌ర్ టైన్‌మెంట్ కోసం వెతుకుతూ ఉంటుంది. బిగ్‌బాస్ ఓటీటీ ఖ‌చ్చితంగా దాన్ని అందిస్తుంద‌ని ఆశిస్తున్న‌ట్లు చెప్పాడు. కంటెంట్ ఇంప్రూవ్‌మెంట్ కోసం తగిన జాగ్రత్తలు తీసుకొంటాన‌న్నాడు. అశ్లీలత, అసభ్యత, బూతులు లేకుండా చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు వెల్ల‌డించాడు. చిన్నారులు కూడా దీన్ని చూసే అవ‌కాశం ఉండ‌డంలో క్లీన్ కంటెంట్ ఉండేలా చూసుకొంటామ‌ని హామీ ఇచ్చారు.

స‌న్నీ లియోనీ కూడా..

బిగ్‌బాస్ ఓటీటీ 2 షోలో స‌న్నీ లియోనీ కూడా భాగ‌స్వామ్యం కానుంద‌ట‌. అయితే ఆమె కంటెస్టెంట్‌గా కాకుండా గెస్ట్‌గా, ప్యానెలిస్ట్ గా ఉండ‌నుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. స‌ల్మాన్‌కు కో-హోస్ట్‌గా స‌న్నీ లియోనీ ఉండ‌నుంద‌ని అంటున్నారు. వీటిలో ఏది నిజం అన్న‌ది తెలియ‌క‌పోయినా ఆమె మాత్రం ప‌క్కాగా షోలో ఏదో ఒక స‌మ‌యంలో క‌నిపించ‌డం మాత్రం ప‌క్కా. ఇందుకు సంబంధించిన ఓ హింట్‌ను ఇప్ప‌టికే స‌న్నీ ఇచ్చింది.

Guntur Kaaram : ‘గుంటూరు కారం’ సంక్రాంతికి రాదా? మళ్ళీ షూటింగ్ వాయిదా..

బిగ్‌బాస్ ఓటీటీలో పాల్గొంటుండ‌డం నాకు మ‌ళ్లీ ఇంటికి వ‌చ్చిన‌ట్లుగా అనిపిస్తోందని చెప్పింది. బిగ్‌బాస్ షో లో త‌న‌కు చాలా జ్ఞాప‌కాలు ఉన్నాయ‌ని, త‌న కెరీర్‌కు బిగ్‌బాస్ పెద్ద ట‌ర్నింగ్ పాయింట్ అని చెప్పుకొచ్చింది. ఈ షోను తాను ఎప్ప‌టి నుంచో చూస్తున్న‌ట్లు తెలిపింది. ఈ సీజ‌న్ మ‌రింత స‌న్నీగా ఉండ‌నుంద‌ని అని తెలిపింది.