Bollywood Drugs Case : మహేష్ భార్య నమ్రత పేరు?

  • Published By: sekhar ,Published On : September 22, 2020 / 06:48 PM IST
Bollywood Drugs Case : మహేష్ భార్య నమ్రత పేరు?

Updated On : September 22, 2020 / 7:12 PM IST

Bollywood Drugs Case – Namrata Shirodkar: డ్రగ్స్ ఆరోపణలతో బాలీవుడ్, శాండల్ వుడ్ ఇండస్ట్రీలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నాయి. రోజురోజుకీ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి.


ఈ కేసులో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ పేరు బయటపడ్డట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆమెకు డ్రగ్స్ సప్లయ్ చేసినట్టుగా విచారణ ఎదుర్కొంటున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మేనేజర్ జయ సాహా వాంగ్మూలం ఇచ్చారని తెలుస్తోంది. ఎన్సీబీ ట్రాకింగ్లో జయ సాహా, నమ్రత చాటింగ్ కూడా బయటపడిందని పలు కథనాలు వెలువడుతున్నాయి.


టాలీవుడ్‌‌లో ఇప్పటి వరకు రకుల్ ప్రీత్ సింగ్ పేరు మాత్రమే వినిపించగా… ప్రస్తుతం నమ్రత పేరు రావడంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే కూడా జయ సాహాతో డ్రగ్స్ గురించి చాట్ చేసినట్లు సమాచారం.


బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో డ్రగ్స్ మూలాలు బయటపడడంతో ఆ దిశగా ఎన్.సీ.బీ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే సుశాంత్ ప్రియురాలు నటి రియా చక్రవర్తితోపాటు ఆమె సోదరుడు సుశాంత్ మేనేజర్ ఇద్దరు డ్రగ్ డీలర్లను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే..


తాజాగా సుశాంత్ మేనేజర్ జయ సాహా సోమవారం ఎన్.సీబీ ఎదుట హాజరయ్యారు ఆమె ఫోన్ నుంచి సేకరించిన డేటా ఆధారంగా పలువురు బాలీవుడ్ సెలెబ్రెటీలు సీబీడీ ఆయిల్ (గంజాయి ఆకుల నుంచి తీసిన ద్రవం) డ్రగ్స్ ను సరఫరా చేయాల్సిందిగా తనను కోరినట్లు వెల్లడించారు.


ఈ క్రమంలోనే పలువురు బాలీవుడ్ సెలెబ్రెటీల కోసం జయ సాహా ప్రత్యేకంగా ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసినట్లు సమాచారం. దీంతో జయకు సీబీడీ ఆయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై పోలీసులు ఆరాతీస్తున్నట్టు తెలిసింది.