Ashok Galla : సైలెంట్‌గా మహేష్ బాబు అల్లుడి నెక్స్ట్ సినిమా మొదలు.. క్లాప్ కొట్టిన నమ్రత..

తాజాగా అశోక్ గల్లా నెక్స్ట్ సినిమా ఓపెనింగ్ జరిగింది.

Ashok Galla : సైలెంట్‌గా మహేష్ బాబు అల్లుడి నెక్స్ట్ సినిమా మొదలు.. క్లాప్ కొట్టిన నమ్రత..

Mahesh Son in Law Ashok Galla New Movie Opening with Namrata Clap

Updated On : September 22, 2024 / 6:59 AM IST

Ashok Galla : మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా గతంలో హీరో అనే సినిమాతో హీరోగా సినీ పరిశ్రమకు పరిచయమైన సంగతి తెలిసిందే. త్వరలో దేవకీ నందన వాసుదేవ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా అశోక్ గల్లా నెక్స్ట్ సినిమా ఓపెనింగ్ జరిగింది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో అశోక్ గల్లా హీరోగా ఉద్భవ్ రచన దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. నిన్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. మహేష్ భార్య నమ్రత ఘట్టమనేని క్లాప్ కొట్టగా, పద్మ గల్లా, మంజుల స్వరూప్ చేతుల మీదుగా స్క్రిప్ట్‌ని అందజేశారు.

Also Read : NTR – Pawan Kalyan : ఆల్ ది బెస్ట్ తారక్.. మా ప్రభుత్వం సినిమా పరిశ్రమకు సపోర్ట్‌గా ఉంటుంది.. పవన్ కళ్యాణ్ స్పెషల్ ట్వీట్..

అమెరికా నేపథ్యంలో రొమాంటిక్ కామెడీ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కబోతుందని సమాచారం. అశోక్ గల్లాతో పాటు శ్రీ గౌరీ ప్రియ, రాహుల్ విజయ్, శివాత్మిక ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్ చివరి వారం నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. దీంతో మహేష్ ఫ్యాన్స్ అశోక్ గల్లాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.