Ante Sundaraniki: నాని సినిమాకి ఏడు రిలీజ్ డేట్స్.. పెద్ద చిక్కే!
గత ఏడాది వరసగా రెండు సినిమాలు ప్లాప్ కావడం.. అది కూడా థియేటర్లులో విడుదల కాకుండా ఓటీటీలో విడుదల కావడంతో కాస్త డల్ అయిన నేచురల్ స్టార్ నానీ..

Ante Sundaraniki
Ante Sundaraniki: గత ఏడాది వరసగా రెండు సినిమాలు ప్లాప్ కావడం.. అది కూడా థియేటర్లులో విడుదల కాకుండా ఓటీటీలో విడుదల కావడంతో కాస్త డల్ అయిన నేచురల్ స్టార్ నానీ.. శ్యామ్ సింగరాయ్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అది కూడా సౌత్ అన్ని బాషలలో విడుదల కావడం.. అక్కడా సినిమాకి మంచి మార్కులే పడడంతో ఇప్పుడు అదే ఊపులో తన సినిమాల లైనప్ సెట్ చేసుకుంటున్నాడు.
Allu Arjun Twitter: తగ్గేదేలే.. రజినీని మించిపోయిన బన్నీ!
నానీ ఇప్పుడు తన కెరీర్ లో 28వ సినిమాగా ‘అంటే సుందరానికి’ అనే సినిమా చేస్తున్నాడు. పక్కా ఫన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా లాంటి మంచి సినిమాలు అందించిన వివేక్ ఆత్రేయ ఈ సినిమాకి డైరెక్టర్ కాగా.. నజ్రియా నానీ సరసన హీరోయిన్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లాంటి సంస్థ నిర్మిస్తుండడం కూడా ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి.
Stars OTT Entry: ఇప్పుడిదే ట్రెండ్.. ఓటీటీ ఎంట్రీ ఇస్తున్న స్టార్స్!
కాగా, ఇప్పుడు నానీ ‘అంటే సుందరానికి’ సినిమాకి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు రిలీజ్ డేట్స్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. అది కూడా.. మీరు అంతా రెండు రెండు బ్లాక్ చేస్తే మేము ఏడు చేయకూడదా అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తూ ట్విట్టర్ లో ఓ పోస్టర్ ద్వారా ఈ ఏడు డేట్స్ ప్రకటించారు. ఏప్రిల్ 22 , ఏప్రిల్ 29, మే 6, మే 20, మే 27, జూన్ 3, జూన్ 10 తేదీలలో ఒక రోజు ఈ సినిమా విడుదల కానుందని ప్రకటించగా.. ‘ఫుల్ ఆవకాయ సీజన్ బ్లాక్డ్..
మెల్లగా డిసైడ్ చేస్తాం’ అంటూ ఫన్నీ కామెంట్ పెట్టారు.
మీరు అంతా రెండు రెండు Block చేస్తే మేము ఏడు చేయకూడదా ?
Full ఆవకాయ season blocked.
Mellaga decide chestham ?#AnteSundaraniki#NazriyaFahadh #VivekAthreya @MythriOfficial @oddphysce @nikethbommi pic.twitter.com/31yC8ruXyZ
— Nani (@NameisNani) February 3, 2022