Radhe Shyam : క్లైమాక్స్ 15 నిమిషాల కోసం అన్ని కోట్లా!

దాదాపు 15 నిమిషాల పాటు ఉత్కంఠ భరితంగా సాగే ‘రాధే శ్యామ్’ క్లైమాక్స్‌‌కే ఈ రేంజ్‌లో ఖర్చు పెట్టారంటే.. ఓవరాల్‌గా సినిమాకి ఎంత పెట్టి ఉంటారో..?

Radhe Shyam : క్లైమాక్స్ 15 నిమిషాల కోసం అన్ని కోట్లా!

Radhe Shyam Climax

Updated On : October 23, 2021 / 12:00 PM IST

Radhe Shyam: ‘బాహుబలి’ తెచ్చిపెట్టిన ‘పాన్ ఇండియా స్టార్’ క్రేజ్‌ని నిలబెట్టుకోవడానికి తనవంతుగా ఎంత కష్టపడాలో అంతా పడుతున్నారు రెబల్ స్టార్ ప్రభాస్.. వరుసగా ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు లైన్‌లో పెడుతున్నారు. దాదాపు మూడేళ్లుగా ‘రాధే శ్యామ్’ సినిమాకే అంకితమైపోయారు ప్రభాస్ అండ్ రాధా కృష్ణ..

Radhe Shyam : సంక్రాంతికి ‘రాధే శ్యామ్’.. ‘వర్షం’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా..?

డార్లింగ్ అండ్ గోర్జియస్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో, రెబల్ స్టార్ డా.యూ.వి.కృష్ణంరాజు సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్ధలు గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ల మీద వంశీ, ప్రమోద్, ప్రసీద (ప్రభాస్ సిస్టర్) ఈ పాన్ ఇండియా సినిమాను భారీ స్థాయిలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.

Prabhas Family : ఫ్యామిలీ పెద్దదే డార్లింగ్..!

అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఉదయం 11:16 గంటలకు ‘రాధే శ్యామ్’ టీజర్ రిలీజ్ చెయ్యబోతున్నారు. అలాగే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. క్లైమాక్స్ కోసం కళ్లు చెదిరేలా ఖర్చు పెట్టారట.

 

View this post on Instagram

 

A post shared by Prabhas (@actorprabhas)

దాదాపు 15 నిమిషాల పాటు ఉత్కంఠ భరితంగా సాగే ‘రాధే శ్యామ్’ క్లైమాక్స్‌కి ఓవరాల్‌గా 50 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు మేకర్స్. ఒక క్లైమాక్స్‌కే ఈ రేంజ్‌లో ఖర్చు పెట్టారంటే.. ఇక సెట్స్‌కి, సాంగ్స్‌కి ఎంతలా ఖర్చు చేసుంటారో అర్థం చేసుకోవచ్చు. 2022 జనవరి 14న సంక్రాంతి కానుకగా సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.