Malaika Arora : బాలీవుడ్ లో మరో కొత్త షో.. మలైకా అరోరాతో హాట్ టాక్స్..

బాలీవుడ్ లో చాలా పాపులర్ షోలు ఉన్నాయి. బాలీవుడ్ స్టార్స్ సైతం హోస్ట్ గా షోలు చేస్తున్నారు. తాజాగా మలైకా అరోరా హోస్ట్ గా కొత్త షో ప్రారంభం అవుతుంది. మూవింగ్ ఇన్ విత్ మలైకా పేరుతో హాట్‌స్టార్ ఓటీటీలో...............

Malaika Arora : బాలీవుడ్ లో మరో కొత్త షో.. మలైకా అరోరాతో హాట్ టాక్స్..

Malaika Arora starts a new bollywood show in the name of moving in with malaika

Updated On : December 5, 2022 / 9:39 AM IST

Malaika Arora :  బాలీవుడ్ భామ మలైకా అరోరా తన సినిమాల కంటే కూడా తన డ్రెస్సింగ్స్, తన రిలేషన్స్ తోనే బాగా ఫేమస్ అయింది. 49 ఏళ్ళు వచ్చినా ఇంకా హాట్ హాట్ గా ఫోటోలు పోస్ట్ చేస్తూ ఐటెం సాంగ్స్ చేస్తూ కుర్రాళ్ళ మతి పోగొడుతుంది. ఇవన్నీ చాలవన్నట్టు తనకంటే 12 ఏళ్ళు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తుంది. ఈ విషయంలో మలైకా బాలీవుడ్ లో ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటుంది.

ఇప్పటికే బాలీవుడ్ లో చాలా పాపులర్ షోలు ఉన్నాయి. బాలీవుడ్ స్టార్స్ సైతం హోస్ట్ గా షోలు చేస్తున్నారు. తాజాగా మలైకా అరోరా హోస్ట్ గా కొత్త షో ప్రారంభం అవుతుంది. మూవింగ్ ఇన్ విత్ మలైకా పేరుతో హాట్‌స్టార్ ఓటీటీలో సరికొత్త షో రాబోతుంది. దీనికి సంబంధించిన ప్రోమోలు కూడా రిలీజ్ చేశారు. డిసెంబర్ 5 నుంచి ఈ షో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది.

Mahesh – Rajamouli Film : జూన్‌లో షూటింగ్.. రాజమౌళి-మహేష్ సినిమాపై విజయేంద్రప్రసాద్ వ్యాఖ్యలు..

ఈ షోలో మలైకా తన లైఫ్ లోని అనుభవాలు, సినీ పరిశ్రమ గురించి, అలాగే పలువురు గెస్ట్స్ ని పిలిచి వాళ్ళ గురించి కూడా మాట్లాడనుంది. మాములు మాటలు కాకుండా రొమాంటిక్ టాక్స్, హాట్ టాక్స్ చేయనున్నట్లు మలైకా చెప్పింది. ఇప్పటివరకు తన బోల్డ్ డ్రెస్సింగ్, తన బోల్డ్ డెసిషన్స్ తో వైరల్ అవుతున్న మలైకా ఈ షోలో ఇంకెంత బోల్డ్ గా మాట్లాడుతుందో చూడాలి మరి.