Malvika Sharma : ఈ హీరోయిన్ లాయర్ అని మీకు తెలుసా? ఇంకా పై చదువులు కూడా..

ఈ హీరోయిన్ లా చదివి లాయర్ అయి హీరోయిన్ గా కూడా సినిమాలు చేస్తుంది.

Malvika Sharma : ఈ హీరోయిన్ లాయర్ అని మీకు తెలుసా? ఇంకా పై చదువులు కూడా..

Malavika Sharma Professionally Advocate turned as Actress and Studying Masters Pic Credits : Instagram/ Malavika Sharma

Updated On : April 30, 2024 / 11:46 AM IST

Malvika Sharma : మన సినీ సెలబ్రిటీలతో చాలామంది వేరే ఫీల్డ్స్ లో చదువుకొని అనుకోకుండానో, ప్యాషన్ మీదో సినీ పరిశ్రమకి వస్తారు. కొంతమంది వచ్చిన ఛాన్సులు వదులుకోకుండా సినీ పరిశ్రమలో ఉంటూనే చదువుకుంటారు కూడా. సినీ పరిశ్రమలో డాక్టర్ చదివి యాక్టర్ అయినా వాళ్ళు చాలా మంది ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఈ హీరోయిన్ లా చదివి లాయర్ అయి హీరోయిన్ గా కూడా సినిమాలు చేస్తుంది.

ఆ హీరోయిన్ ఎవరో కాదు మాళవిక శర్మ. ముంబైకి చెందిన మాళవిక శర్మ బ్యాచిలర్స్ లా చదువుతున్నప్పుడు మోడల్ గా అవకాశాలు రావడంతో కొన్ని యాడ్స్ లో నటించింది. ముంబైలోని రిజ్వి లా కాలేజీలో చదివింది మాళవిక. క్రిమినాలజీ స్పెషలైజేషన్ బ్రాంచ్ లో లా చేసింది. లా చదువుతున్న సమయంలో టాలీవుడ్ లో రవితేజ సరసన నేల టికెట్ సినిమాలో అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని నేల టికెట్ సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమాలు చేస్తూనే అడ్వకేట్ అయింది. ఆ తర్వాత రెడ్, కాఫీ విత్ కాదల్ సినిమాలతో పలకరించిన మాళవిక ఇటీవలే గోపీచంద్ సరసన భీమా సినిమాతో మెప్పించింది.

Malavika Sharma Professionally Advocate turned as Actress and Studying Masters

కొన్నాళ్ల క్రితమే మాస్టర్స్ లా కూడా చదవడం మొదలుపెట్టింది మాళవిక. త్వరలో సుధీర్ బాబు సరసన హరోంహర సినిమాతో రాబోతుంది. మాళవిక శర్మ ఇప్పుడిప్పుడే సినిమాలతో బిజీ అవుతుంది. ఓ పక్క సినిమాలు చేస్తూనే మాస్టర్స్ లా కూడా చేస్తుంది. హీరోయిన్ కెరీర్ ఉన్నంతకాలం సినిమాలు చేసి ఫ్యూచర్ లో కచ్చితంగా లాయర్ గానే స్థిరపడుతుందని సమాచారం. ఇక సోషల్ మీడియాలో మాళవిక రెగ్యులర్ గా ఫొటోలు షేర్ చేస్తూ యాక్టివ్ గా ఉంటుంది. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో కూడా అడ్వకేట్, LLM స్టూడెంట్ అని పెట్టింది కానీ యాక్టర్ అని పెట్టకపోవడం గమనార్హం.