Premalu : తెలుగు ఆడియన్స్‌ని ఫిదా చేస్తున్న తమిళ్, కన్నడ, మలయాళ ప్రేమ కథలు.. ఇప్పుడు ‘ప్రేమలు’ తెలుగు రిలీజ్..

ఈమధ్య తెలుగు ప్రేక్షకులు.. తమిళ్, కన్నడ, మలయాళ ప్రేమ కథలకు ఫిదా అవుతున్నారు. ఇప్పుడు 'ప్రేమలు' అనే మలయాళ మూవీ తెలుగు రిలీజ్..

Premalu : తెలుగు ఆడియన్స్‌ని ఫిదా చేస్తున్న తమిళ్, కన్నడ, మలయాళ ప్రేమ కథలు.. ఇప్పుడు ‘ప్రేమలు’ తెలుగు రిలీజ్..

malayala block buster love story Premalu movie releasing in telugu

Updated On : February 29, 2024 / 6:48 AM IST

Premalu : తెలుగు ఆడియన్స్‌కి సినిమాలు ఏ భాషకి సంబంధించినవి అనే బేధం ఉండదు. ఏ లాంగ్వేజ్ మూవీ అయినాసరే అది బాగుంటే.. చూసి ఆదరిస్తూ ఉంటారు. అందుకునే ప్రతి పరిశ్రమకి చెందిన వ్యక్తులు.. తెలుగు ఆడియన్స్ వరల్డ్ లోనే బెస్ట్ ఆడియన్స్ అంటూ కామెంట్స్ చేస్తుంటారు. కాగా ఈమధ్య తెలుగు ప్రేక్షకులు.. తమిళ్, కన్నడ, మలయాళ ప్రేమ కథలకు ఫిదా అవుతున్నారు.

తమిళంలో తెరకెక్కిన జోయ్, లవ్ టుడే, లవర్. కన్నడలో రూపొందిన సప్త సాగరాలు దాటి, లవ్ మాక్‌టైల్, దియా. మాలయంలో తెరకెక్కిన హృదయం లాంటి సినిమాలు తెలుగు ఆడియన్స్ ని ఫిదా చేసేస్తున్నాయి. ఆయా భాషల్లో రిలీజ్ అయ్యి హిట్ కొట్టిన లవ్ స్టోరీని.. తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేస్తున్నారు. ఈక్రమంలోనే రీసెంట్ గా మలయాళంలో బ్లాక్ బస్టర్ సాధించిన ‘ప్రేమలు’ మూవీని తెలుగు రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు.

Also Read : Varun Tej : వరుణ్ తేజ్ ఫస్ట్ మూవీ ఏంటో తెలుసా..? చైల్డ్ ఆర్టిస్టుగా..

శివరాత్రి సందర్భంగా మార్చి 8న ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. పుష్ప ఫేమ్ ‘ఫహద్ ఫాసిల్’ ఈ చిత్రాన్ని నిర్మించారు. నస్లెన్ కె గఫూర్, మమిత బైజు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాని రొమాంటిక్ కామెడీ ఫిలింగా గిరీష్ డైరెక్ట్ చేసారు. కేవలం మూడు కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం.. మలయాళంలో ఫిబ్రవరి 9న రిలీజయ్యి ఇప్పటివరకు దాదాపు 60 కోట్ల కలెక్షన్స్ ని అందుకుంది.

ఈ మూవీని ఆల్రెడీ మలయాళంలో చూసేసిన తెలుగు ఆడియన్స్.. మూవీ పై మంచి రివ్యూలు ఇచ్చేసారు. ఇక ఇప్పుడు తెలుగులో రిలీజ్ అవుతుండడంతో సినిమా పై మంచి బజ్ ఉంది. ఈ సినిమా తెలుగు రిలీజ్ కి ఉన్న మరో ప్లస్ ఏంటంటే.. ఈ మూవీలోని చాలా టాకీ పార్ట్ హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్ లో తెరకెక్కించారు. తెలుగు సినిమాల్లో కూడా చూపించిన హైదరాబాద్ అందాలను ఈ మూవీలో చూపించారని ఆడియన్స్ చెప్పుకొచ్చారు.