హోటల్ గదిలో విగతజీవిగా కనిపించిన సినీనటుడు

హోటల్‌లో ఉంటున్న సమయంలో అతడు ఒక్కసారి కూడా తన గది నుంచి బయటకు రాలేదని తెలుస్తోంది.

Malayalam Actor Dileep Shankar

Dileep Shankar: మలయాళ నటుడు దిలీప్ శంకర్ ఇవాళ తిరువనంతపురంలోని ఓ హోటల్ గదిలో విగతజీవిగా కనిపించాడు. ఆయన మృతికి గల కారణాల గురించి వివరాలు తెలియరాలేదు. ఆయన గురించి స్థానిక మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం.. ఈ నెల 19 నుంచి దిలీప్ హోటల్‌లో ఉంటున్నాడు.

హోటల్‌లో ఉంటున్న సమయంలో అతడు ఒక్కసారి కూడా తన గది నుంచి బయటకు రాలేదని తెలుస్తోంది. అతని సహనటులు అతడికి ఫోన్‌ చేసినప్పటికీ ఎత్తలేదు. దీంతో వారు దిలీప్‌ కోసం హోటల్‌కు వచ్చారు. అతడి గదిని తెరవాని హోటల్ సిబ్బందిని కోరారు.

గది తెరచి చూస్తే అందులో దిలీప్‌ విగతజీవిగా కనపడ్డాడు. టెలివిజన్ సిరీస్ పంచాగ్ని షూటింగ్ కోసం దిలీప్ శంకర్ కొన్ని రోజులుగా తిరువనంతపురంలో ఉన్నారని తెలుస్తోంది. దిలీప్ కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని షో డైరెక్టర్ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

దిలీప్ అనారోగ్యంతో పోరాడుతూ చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. దిలీప్ శంకర్ మృతిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఫోరెన్సిక్ బృందం హోటల్‌ వద్దకు చేరుకున్న అతడు ఉన్న గదిని పరిశీలించింది. పోస్ట్‌మార్టం రిపోర్టు వచ్చిన తర్వాత అతడి మరణానికి గల కచ్చితమైన కారణాలు తెలుస్తాయి.

Air plane crash: వామ్మో ఘోర విమాన ప్రమాదాలు.. ఈ నెలలో ఎక్కడెక్కడ, ఎన్ని జరిగాయో తెలుసా?