Kollam Sudhi: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు దుర్మరణం.. మరో ముగ్గురు మిమిక్రీ ఆర్టిస్టులకు తీవ్రగాయాలు
ప్రముఖ మలయాళ నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ కొల్లం సుధీ(Kollam Sudhi) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన వయసు 39 సంవత్సరాలు. మరో ముగ్గురు మిమిక్రీ ఆర్టిస్టులు తీవ్రంగా గాయపడ్డారు.

Malayalam actor Kollam Sudhi
Malayalam actor Kollam Sudhi: ఇటీవల కాలంలో సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరి మరణాన్ని జీర్ణించుకోకముందే ఇంకొకరు కన్నుమూస్తున్నారు. ఈ రోజు(జూన్ 5 సోమవారం) తెల్లవారుజామున ప్రముఖ మలయాళ నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ కొల్లం సుధీ(Kollam Sudhi) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన వయసు 39 సంవత్సరాలు. మరో ముగ్గురు మిమిక్రీ ఆర్టిస్టులు తీవ్రంగా గాయపడ్డారు.
నటుడు సుధీ తో పాటు మరో ముగ్గురు మిమిక్రీ కళాకారులు బిను ఆదిమలు, ఉల్లాస్, మహేష్ లు వటకరాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తిరుగు ప్రయాణంలో కేరళలోని కైపమంగళం ప్రాంతంలో వీరు ప్రయాణిస్తున్న కారు తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఓ ట్రక్కును ఢీ కొట్టినట్లు పోలీసులు తెలిపారు. సుధీ తలకు బలమైన గాయమైంది. కొడుంగలూర్ లో ఓ ఆసుపత్రికి తరలించారు. అయితే.. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మిగిలిన ముగ్గురికి చికిత్స అందిస్తున్నారు.
Sumalatha : సుమలత కొడుకు పెళ్ళిలో పాన్ ఇండియా స్టార్స్ రజనీకాంత్, యశ్.. ఫోటోలు!
కొల్లం సుధీ ఇక లేడు అనే వార్తతో మలయాళ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. పలువురు నటీనటులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేశారు. సుధీ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం వ్యక్తం చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది.
View this post on Instagram
మిమిక్రీ ఆర్టిస్టు అయిన సుధీ 2015లో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు. కట్టప్పనలియె రిత్విక్ రోషన్, కుట్టనందన్ మర్పప్ప వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పలు టెలివిజన్ షోలు, స్టేజ్ షోలలో తన నటన, మిమిక్రీతో ప్రేక్షకులను అలరించారు. అతడికి భార్య రేణు ఇద్దరు పిల్లలు ఉన్నారు.