Mohan Lal : విమర్శలు రావడంతో క్షమాపణలు చెప్పిన మోహన్ లాల్.. లూసిఫర్ సీక్వెల్ విషయంలో.. 17 నిముషాలు కట్..

సోషల్ మీడియాలో బాయ్ కాట్ ఎంపురాన్ అని ట్రెండ్ అయింది.

Mohan Lal Says Sorry After Criticisms came on Empuraan Movie

Mohan Lal : మోహన్ లాల్, పృథ్విరాజ్ సుకుమారన్ కలిసి ఇటీవల లూసిఫర్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఎంపురాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాని మార్చ్ 27న రిలీజ్ చేసారు. అయితే లూసిఫర్ కథకి సంబంధం లేకుండా ఇందులో గుజరాత్ అల్లర్లు, మత ఘర్షణలు, కేరళ పార్టీల గొడవలు చూపించడంతో అసలు ఇది లూసిఫర్ సీక్వెల్ కాదు అని ఫ్యాన్స్, ప్రేక్షకులు నిరాశ చెందారు.

అంతేకాకుండా గుజరాత్ అల్లర్లని ఒక వర్గానికి సపోర్ట్ గా చూపించడం, ఒక వర్గాన్ని కించపరుస్తూ సన్నివేశాలు, డైలాగ్స్ ఉండటం, కొంతమంది రాజకీయ నాయకులను ఉద్దేశించి సీన్స్ తీయడంతో ఎంపురాన్ సినిమాపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. మోహన్ లాల్ ఇలాంటి సినిమా తీయడమా అంటూ కూడా విమర్శించారు.

Also Read : Peddi Update : రామ్ చరణ్ ‘పెద్ది’ అప్డేట్.. వచ్చేది ఆ పండక్కే.. కొత్త పోస్టర్ రిలీజ్..

సోషల్ మీడియాలో బాయ్ కాట్ ఎంపురాన్ అని ట్రెండ్ అయింది. అలాగే అసలు చాలా సీన్స్ సెన్సార్ చేయకుండానే సెన్సార్ ఇచ్చారని సెన్సార్ బోర్డు మీద కూడా విమర్శలు వచ్చాయి. సినిమా కలెక్షన్స్ మీద కూడా ఎఫెక్ట్ అయింది. ఎన్నో అంచనాలతో రిలీజయిన ఈ సినిమా రిలీజ్ ముందే భారీ ఓపెనింగ్స్ తో వస్తే సినిమా రిలీజ్ అయ్యాక రెండో రోజుకే థియేటర్స్ ఖాళీ అయ్యాయి.

దీంతో నిర్మాణ సంస్థ వెనక్కి తగ్గి మళ్ళీ సెన్సార్ చేయించి 17 నిముషాలు సినిమా కట్ చేసి నేటి నుంచి రిలీజ్ చేసారు. ఈ విషయంలో మోహన్ లాల్, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోపై ఈ రేంజ్ విమర్శలు రావడంతో మోహన్ లాల్ స్పందించారు. మోహన్ లాల్ ఈ విమర్శలపై స్పందిస్తూ తన సోషల్ మీడియాలో క్షమాపణలు చెప్తూ ఓ పోస్ట్ చేసారు.

Also Read : Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ షూటింగ్ ఎక్కడో చెప్పేసిన సందీప్ రెడ్డి వంగ.. వీడియో వైరల్..

మోహన్ లాల్ తన పోస్ట్ లో.. లూసిఫర్ సీక్వెల్ గా వచ్చిన ఎంపురాన్ సినిమాలోని కొన్ని రాజకీయ, సామాజిక సన్నివేశాలు నాకు ప్రియమైన వారికి చాలా మందికి బాధ కలిగించాయి అని నేను తెలుసుకున్నాను. నా సినిమాల్లో ఏ రాజకీయ ఉద్యయం, మతపరమైన భావాల పట్ల ద్వేషం ఉండకుండా చూసుకోవడం నటుడిగా నా కర్తవ్యం. ఎంపురాన్ సినిమా వల్ల మీకు కలిగిన బాధకు మేము చింతిస్తున్నాము. దీనికి బాధ్యులు అయిన నేను, మా టీమ్ మీకు క్షమాపణలు చెప్తున్నాము. అలాంటి అంశాలను సినిమా నుంచి తొలగించాలని నిర్ణయించుకున్నాము అంటూ రాసుకొచ్చారు.