Peddi Update : రామ్ చరణ్ ‘పెద్ది’ అప్డేట్.. వచ్చేది ఆ పండక్కే.. కొత్త పోస్టర్ రిలీజ్..

తాజాగా నేడు ఉగాది పండగ సందర్భంగా పెద్ది సినిమా గ్లింప్స్ అప్డేట్ ఇచ్చారు.

Peddi Update : రామ్ చరణ్ ‘పెద్ది’ అప్డేట్.. వచ్చేది ఆ పండక్కే.. కొత్త పోస్టర్ రిలీజ్..

Ram Charan Janhvi Kapoor Peddi Movie Glimpse Release Date Announced

Updated On : March 30, 2025 / 3:35 PM IST

Peddi Update : ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు సాన ద‌ర్శ‌క‌త్వంలో RC16 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రామ్ చరణ్ పుట్టిన రోజు నాడు ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ప్రకటించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు. ఈ సినిమాలో జాన్వీక‌పూర్ హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ స్టార్ హీరో శివన్న, మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు కీలక పాత్రలను పోషిస్తున్నారు.

Also Read : Puri Jagannadh : కంబ్యాక్ ఇవ్వబోతున్న పూరి జగన్నాధ్.. విజయ్ సేతుపతితో సినిమా అనౌన్స్.. షూటింగ్ ఎప్పుడో తెలుసా?

అయితే చరణ్ పుట్టిన రోజున గ్లింప్స్ రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ ఆశించారు. కానీ టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల అది వాయిదా పడింది. తాజాగా నేడు ఉగాది పండగ సందర్భంగా పెద్ది సినిమా గ్లింప్స్ అప్డేట్ ఇచ్చారు. రామ్ చరణ్ పెద్ది సినిమా ఫస్ట్ షాట్ – గ్లింప్స్ వీడియోని ఏప్రిల్ 6న శ్రీరామ నవమి పండగ రోజు రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఈ గ్లింప్స్ కోసం ఎదురుచూస్తున్నారు.

Ram Charan Janhvi Kapoor Peddi Movie Glimpse Release Date Announced

ఈ అప్డేట్ ఇస్తూ ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేసారు. ఇందులో చరణ్ గాల్లో జంప్ చేస్తున్నట్టు పవర్ ఫుల్ గా ఉంది. గ్లింప్స్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి మరి. ఇక ఈ సినిమాని వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు.