Nirmal Benny : సినీ పరిశ్రమలో విషాదం.. 37 ఏళ్ల వయసులో గుండెపోటుతో హాస్య నటుడు నిర్మల్ బెన్నీ కన్నుమూత
ప్రముఖ మలయాళ నటుడు నిర్మల్ బెన్నీ గుండెపోటుతో కన్నుమూశాడు.

Malayalam actor Nirmal Benny dies
Nirmal Benny dies : సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళ నటుడు నిర్మల్ బెన్నీ గుండెపోటుతో కన్నుమూశాడు. ఆయన వయసు 37 సంవత్సరాలు. ఈ విషయాన్ని నిర్మాత సంజయ్ పడియూర్ ధ్రువీకరించారు. సోషల్ మీడియాలో బరువెక్కిన హృదయంతో సంజయ్ స్పెషల్ నోట్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు.
‘నా ప్రియస్నేహితుడికి వీడ్కోలు. ఆమెన్ మూవీలో కీలక పాత్ర పోషించిన ఈ నటుడు ఈ తెల్లవారుజామున గుండెపోటుతో మరణించాడు. అతడి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.’ అని రాసుకొచ్చారు. నిర్మల్ బెన్నీ మృతితో మలయాళ చిత్ర పరిశ్రమకు తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.
Ravi Teja : షూటింగ్‌లో గాయపడ్డ మాస్ మహారాజా రవితేజ.. ఆస్పత్రిలో శస్త్రచికిత్స పూర్తి..
యూట్యూబ్ వీడియోలు, స్టేజ్ పెర్ఫార్మెన్స్‌ల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు నిర్మల్ బెన్నీ. సినీ రంగంలో హాస్యనటుడిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. 2012లో ‘నవగాథార్కు స్వాగతం’ మూవీతో మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు. తన కెరీర్‌లో బెన్నీ ఐదు చిత్రాలలో నటించాడు, ఇందులో ఆమెన్ చిత్రం అతడికి మంచి పేరు తెచ్చిపెట్టింది.
View this post on Instagram