Ravi Teja : షూటింగ్‌లో గాయపడ్డ మాస్ మహారాజా రవితేజ.. ఆస్పత్రిలో శస్త్రచికిత్స పూర్తి..
మాస్ మహారాజా రవితేజ షూటింగ్‌లో గాయపడ్డాడు. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించగా శస్త్రచికిత్స నిర్వహించారు.

Mr Bachchan Hero Ravi Teja suffers muscle injury on his upcoming film RT75 sets
మాస్ మహారాజా రవితేజ షూటింగ్‌లో గాయపడ్డాడు. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించగా శస్త్రచికిత్స నిర్వహించారు. ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
తన 75వ సినిమా చిత్రీకరణలో రవితేజ పాల్గొన్నాడు. రచయిత భాను భోగవరపు దర్శకుడిగా ఈ మూవీతోనే పరిచయం కానున్నాడు. RT 75 వర్కింగ్ టైటిట్‌లో ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీని సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
Hema : నటి హేమ పై బ్యాన్ ఎత్తివేసిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్
కాగా.. ఈ సినిమా షూటింగ్‌లో రవితేజ కుడి చేతికి స్వల్ప గాయమైంది. అయితే.. గాయాన్ని సైతం లెక్కచేయకుండా ఆయన షూటింగ్‌లో పాల్గొన్నారు. నొప్పి తీవ్రమైంది. దీంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. గాయాన్ని పరిశీలించిన వైద్యులు శస్త్రచికిత్స చేయాలని సూచించారు.
ఆ తరువాత శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కాగా.. రవితేజ గాయపడిన విషయం తెలిసిన అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
Committee Kurrollu : అయ్య బాబోయ్.. ‘కమిటీ కుర్రోళ్ళు’ కలెక్షన్స్ చూసారా..
సినిమాల విషయానికి వస్తే.. రవితేజ ఇటీవలే మిస్టర్ బచ్చన్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే.. ఈ సినిమా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది.