Malayalam Movie : మలయాళం సూపర్ హిట్ సినిమా.. ఓటీటీలోకి తెలుగు డబ్బింగ్ తో ఎప్పుడు? ఎందులో?
మలయాళం స్టార్ హీరో టొవినో థామస్ నటించిన సినిమా మలయాళంలో పెద్ద హిట్ అవ్వగా ఇప్పుడు త్వరలో ఓటీటీలోకి రాబోతుంది.

Malayalam Movie
Malayalam Movie : మలయాళం సినిమాలు ఇటీవల తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమా తెలుగులోకి కూడా డబ్బింగ్ అవుతున్నాయి. ఇటీవల మలయాళం స్టార్ హీరో టొవినో థామస్ నటించిన నరివేట్ట సినిమా మలయాళంలో పెద్ద హిట్ అవ్వగా ఇప్పుడు త్వరలో ఓటీటీలోకి రాబోతుంది.
ఇండియా సినిమా కంపెనీ బ్యానర్‌పై టిప్పుషన్, షియాస్ హసన్ నిర్మాణంలో అనురాజ్ మనోహర్ దర్శకత్వంలో నరివేట్ట సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో టొవినో థామస్ పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో కనిపించారు. ఆదివాసులకు – పోలీసులకు మధ్య జరిగే పోరాటం, అందులో పోలీస్ కానిస్టేబుల్ ఏం చేసాడు, అక్కడ గొడవలు జరగడం.. లాంటి కథాంశంతో థ్రిల్లర్ జానర్లో ఈ సినిమాని తెరకెక్కించారు.
Also Read : Thammudu : ‘తమ్ముడు’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. నితిన్ సినిమా ఎలా ఉందో..
నరివేట్ట సినిమా సోని లివ్ ఓటీటీలో జులై 11 నుంచి స్ట్రీమింగ్ అవ్వబోతుంది. మలయాళం, తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవ్వనుంది. తాజాగా తెలుగు ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు.