KPAC Lalitha : ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ సీనియర్ నటి కన్నుమూత..

మలయాళ ప్రముఖ సీనియర్​ నటి కేపీఏసీ లలిత ఫిబ్రవరి 22 మంగళవారం రాత్రి మరణించారు. కేరళలోని త్రిపుణితురలో ఆమె నివాసంలో కన్ను మూశారు. వయోభారం వల్ల గత కొన్ని రోజులుగా లలిత అనారోగ్యంతో....

KPAC Lalitha :  ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ సీనియర్ నటి కన్నుమూత..

Kpac Lalitha

Updated On : February 23, 2022 / 11:36 AM IST

KPAC Lalitha :   ఇటీవల కరోనాతో లేదా వేరే ఆరోగ్య సమస్యలతో చాలా మంది సినీ సెలబ్రిటీలు మరణిస్తున్నారు. వారి మరణం సినీ పరిశ్రమకి తీవ్ర శోకాన్ని మిగులుస్తుంది. అన్ని సినీ పరిశ్రమలలోను పలువురు ప్రముఖులు ఇటీవల మృత్యువాత పడ్డారు. ప్రముఖ గాయని లతా మంగేష్కర్, బాలీవుడ్ ఫేమస్ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లహరి, బెంగాలీ గాయని సంధ్య ముఖర్జీ, మలయాళం కమెడియన్ ప్రదీప్ కొట్టాయమ్.. ఇలా వరుస మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా మలయాళం సినీ పరిశ్రమలో మరో సీనియర్ నటి కన్నుమూశారు.

మలయాళ ప్రముఖ సీనియర్​ నటి కేపీఏసీ లలిత ఫిబ్రవరి 22 మంగళవారం రాత్రి మరణించారు. కేరళలోని త్రిపుణితురలో ఆమె నివాసంలో కన్ను మూశారు. వయోభారం వల్ల గత కొన్ని రోజులుగా లలిత అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఆమె మృతిపై మలయాళ స్టార్ హీరోలు మమ్ముట్టి, పృద్విరాజ్ సుకుమారన్ తో సహా పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.

Sarkaru Vaari Paata : ‘కళావతి’ పాటకి తమన్ స్టెప్పులు.. అదరగొట్టావంటూ మహేష్ అభిమానులు..

కేపీఏసీ లలిత అసలు పేరు మహేశ్వరి అమ్మన్. కేపీఏసీ సినిమాలో ఆమె చేసిన అద్భుతమైన నటనకు అదే ఆమె ఇంటిపేరుగా మారిపోయింది. ఆమె సినీ కెరీర్​లో దాదాపు 550కి పైగా చిత్రాల్లో నటించారు. కేరళ సంగీత నాటక అకాడమీకి 5 సంవత్సరాలు చైర్​పర్సన్​గా కూడా ఆమె సేవలు అందిచారు. ఆమె ఉత్తమ సహాయనటి విభాగంలో రెండు జాతీయ అవార్డులు, 4 రాష్ట్ర అవార్డులను సాధించారు. దివంగత మలయాళ చిత్ర నిర్మాత భరతన్ ఆమె భర్త. లలిత మృతి పట్ల మలయాళం సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఇవాళ సాయంత్రం ఆమె అంతక్రియలు నిర్వహించనున్నారు.