Malladi venkata krishnamurthy : మల్లాది వెంకట కృష్ణమూర్తి మెచ్చిన ‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్’ 

మల్లాది వెంకట కృష్ణమూర్తి.. ఈ పేరు తెలియ‌ని పాఠ‌కులు ఉండ‌రు అంటే అతిశ‌యోక్తి కాదేమో.

Malladi venkata krishnamurthy praises master of suspense hitchcock book

మల్లాది వెంకట కృష్ణమూర్తి.. ఈ పేరు తెలియ‌ని పాఠ‌కులు ఉండ‌రు అంటే అతిశ‌యోక్తి కాదేమో. గ‌త 55 ఏళ్లుగా తన నవలలు, పుస్తకాలు, రచనలతో ఎంతో మంది అభిమానుల‌ను సొంతం చేసుకున్నారు. ఆయ‌న రాసిన పుస్త‌కాల గురించి ప్ర‌తి ఒక్క‌రూ మాట్లాడుకోవ‌డం త‌ప్పితే ఆయ‌న క‌న‌పించింది, వినిపించింది లేదు. ఇక‌ వేరే పుస్తకాల గురించి ఆయన చెప్పడం అత్యంత అరుదు. అటువంటి ఆయ‌న్ను మెప్పించింది ‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్’ బుక్.

ఈ పుస్త‌కానికి ఆయ‌న ముందు మాట రాశారు. అంతేకాదండోయ్ ఈ పుస‌క్తాన్ని అభినందిస్తూనే ఓ ప్ర‌శంసా పూర్వ‌క‌మైన ఆడియోను విడుద‌ల చేశారు. ఇందులో ఆయ‌న మాట్లాడుతూ.. ఇంగ్లీష్ సినిమాలు చూడని వారికి కూడా దర్శకుడు ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ పేరు సుపరిచిత‌మేన‌ని అన్నారు. ఆయ‌న సినిమాల‌ను తీసే తీరే అందుకు కార‌ణం. ఆయ‌న తీసిన సినిమాలు చూసిన వారు చూడని వారికి ఆ సినిమాల గురించి చెప్పేంత విశిష్టమైనవిగా అవి ఉంటాయ‌న్నారు.

Gaddar Awards : గద్దర్ అవార్డులకు లైన్ క్లియర్ అయినట్లేనా?

హిచ్‌కాక్ ఎక్కువ‌గా క్రైమ్‌, మిస్ట‌రీ, స‌స్పెన్స్, డ్రామా చిత్రాల‌నే తెర‌కెక్కించారు. తన పేరును ఒక బ్రాండ్ గా చేసుకున్నారు. అందుకు ఆయన తన ఫోటోలను, చతురోక్తులను బాగా ఉపయోగించుకున్నార‌ని తెలిపారు. ‘సైకో’ విడుదలయ్యాక హిచ్‌కాకు ఓ ఉత్త‌రం వ‌చ్చింది. ఆ సినిమాలోని బాత్‌ట‌బ్‌లో హ‌త్య స‌న్నివేశం చూసిన త‌రువాత త‌న భార్య స్నానం చేయ‌డం మానేసింద‌ని, ఏదైన స‌ల‌హా ఇమ్మ‌ని ఆ ఉత్త‌రంలో రాసి ఉంది. ఇందుకు హిచ్‌కాక్ ఇచ్చిన సమాధానం ‘మీ ఆవిడను లాండ్రీకి పంపించండి అని చెప్పారు.

సస్పెన్స్ మహిళ వంటిదని, ఊహకు ఎంత వదిలేస్తే అంత ఉత్కంఠ పెరుగుతుందని హిచ్‌కాక్ చెప్పారు. సినిమా నిడివి ప్రేక్షకుడు బాత్ రూంకు వెళ్లకుండా భరించేంత కాలం మాత్రమే ఉండాలని చెప్పింది హిచ్‌కాక్ అని గుర్తు చేసుకున్నారు. స్నేహితులు పులగం చిన్నారాయణ, రవి పాడి సంపాదకత్వంలో వెలువడ్డ ‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్’ పుస్తకంలో ఆయన తీసిన సినిమాల గురించి వ్యాసాలు ఉన్నాయ‌ని, ఈ పుస్తకం మొదటి ఎడిషన్ రెండు వారాల్లో అమ్ముడు కావడం తెలుగు వారికి హిచ్‌కాక్ మీద ఉన్న అభిమానానికి నిదర్శనం అని చెప్పుకొచ్చారు. ఇక ఈ పుస్తకంలో ముందు మాట రాసే అవకాశం రాకపోతే నేనూ హిచ్‌కాక్ ఫ్యాన్ అని తెలియజేసే అవకాశం ఉండేది కాదు అని మల్లాది వెంకట కృష్ణమూర్తి తెలిపారు.

Venkatesh – Balakrishna : ఆ సమయంలో సినిమాల్లోకి ఎందుకొచ్చానా అని బాధపడ్డా.. నాకు, బాలయ్యకు ఒకేసారి దెబ్బ తగిలింది..

దిగ్గ‌జ ద‌ర్శ‌కుల్లో ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ ఒక‌రు. ఇటీవ‌లే ఆయ‌న‌ 125వ జయంతి, తొలి సినిమా విడుదలై 100 ఏళ్లు పూర్తవుతోంది ఈ సంద‌ర్భంగా హిచ్‌కాక్ సినీ జీవితంపై ‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్’ పేరుతో ఓ పుస్త‌కాన్ని తీసుకువ‌చ్చారు. సీనియర్ జర్నలిస్ట్, సినీ రచయిత పులగం చిన్నారాయణ – ఐఆర్ఎస్ అధికారి రవి పాడితో కలిసి ఈ పుస్తకం తీసుకొచ్చారు. ఈ పుస్త‌కంలో 45 మంది దర్శకులు, 7గురు రచయితలు, 10 మంది జర్నలిస్టులు రాసిన మొత్తం 62 వ్యాసాలు ఉన్నాయి. ఇటీవ‌లే ఈ పుస‌క్తావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు వంశీ చేతుల మీదుగా జ‌రిగింది. తొలి పుస్త‌కాన్ని ద‌ర్శ‌కుడు హరీష్ శంకర్ కు అంద‌జేశారు.