Gaddar Awards : గద్దర్ అవార్డులకు లైన్ క్లియర్ అయినట్లేనా?

రాష్ట్ర విభజన తర్వాత సినిమా అవార్డులు విష‌యం పెండింగ్‌లో ఉంటూ వస్తోంది.

Gaddar Awards : గద్దర్ అవార్డులకు లైన్ క్లియర్ అయినట్లేనా?

Is the line clear for Gaddar Awards

Updated On : December 28, 2024 / 10:50 AM IST

Gossip Garage : రాష్ట్ర విభజన తర్వాత సినిమా అవార్డులు విష‌యం పెండింగ్‌లో ఉంటూ వస్తోంది. అవార్డుల విషయంలో టాలీవుడ్‌ వర్గాలు పదేళ్లుగా అసంతృప్తిలోనే ఉన్నాయి. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు నంది అవార్డుల స్థానంలో సింహా పుర‌స్కారాలు ఇస్తామ‌ని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సింహా స్థానంలో గ‌ద్దర్ అవార్డులు ఇస్తామ‌ని ప్రక‌టించారు. పలువురు సినీ ప్రముఖులతో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అయినా కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.

ఇటీవల టాలీవుడ్ ప్రముఖులతో మీటింగ్‌లో గద్దర్ అవార్డ్స్‌పై చర్చ జరిగినట్టు టాక్. గద్దర్ అవార్స్ ఫంక్షన్ చాలా త్వరగా చేయాలని దాని బాధ్యత తెలంగాణ ఫిలిమ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్‌కు అప్పగించారట సీఎం రేవంత్. దీంతో గద్దర్ అవార్స్ కమిటీ సినీ ప్రముఖులతో చర్చించి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏకాభిప్రాయం వచ్చే విధంగా చేస్తారంటున్నారు.

Venkatesh – Balakrishna : ఆ సమయంలో సినిమాల్లోకి ఎందుకొచ్చానా అని బాధపడ్డా.. నాకు, బాలయ్యకు ఒకేసారి దెబ్బ తగిలింది..

గద్దర్ అవార్డుల అవార్డు ప్రక్రియ మొద‌లుపెడుతామని సీఎం హామీ ఇచ్చారట. ఈ కార్యక్రమం అంతా FDC కోఆర్డినేట్ చేస్తుందని చెప్పారట సీఎం రేవంత్. దాంతో ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్‌రాజు ఛైర్మన్‌ ఆధ్వర్యంలోనే అవార్డుల కార్యక్రమానికి శ్రీ‌కారం చుట్టే అవ‌కాశం ఉంది.

అయితే ఈ అవార్డులు ఎప్పటి నుంచి ఇస్తార‌న్నది మిలియ‌న్ డాల‌ర్ల ప్రశ్నగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి వచ్చిన సినిమాలకు అవార్డులు ఇస్తారా. లేక ఫ్రెష్‌గా 2024 నుంచే ప్రక‌టిస్తారా.? అనేది చూడాల్సిందే.

Venkatesh : మహేష్ నా చిన్న తమ్ముడు.. పవన్ కు నాకు అదే కనెక్ట్ అయింది.. బాలయ్య షోలో వెంకటేష్ కామెంట్స్..