Venkatesh – Balakrishna : ఆ సమయంలో సినిమాల్లోకి ఎందుకొచ్చానా అని బాధపడ్డా.. నాకు, బాలయ్యకు ఒకేసారి దెబ్బ తగిలింది..
బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకి వచ్చిన వెంకటేష్ తనకు అయిన గాయాల గురించి తెలిపాడు.

Venkatesh Talk about his Injury in Balakrishna Unstoppable Show
Venkatesh – Balakrishna : సినిమా షూటింగ్స్ లో ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో నటీనటులకు అప్పుడప్పుడు దెబ్బలు తగులుతూ ఉంటాయి. కొంతమందికి పెద్ద గాయాలే అవి కోలుకోడానికి చాలా సమయం పడుతుంది. వెంకటేష్ కికుడా అలాగే ఒక గాయం అయిందట. తాజాగా ఆహా ఓటీటీలో బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకి వచ్చిన వెంకటేష్ తనకు అయిన గాయాల గురించి తెలిపాడు.
వెంకటేష్ మాట్లాడుతూ.. ఒక ఫైట్ లో అయిన గాయం వల్ల చాన్నాళ్లు బాధపడ్డాను. లెఫ్ట్ సైడ్ బాడీ అంతా నొప్పి వచ్చేది. స్పాండిలోసిస్ లాగా అనిపించేది. దానివల్ల చాన్నాళ్లు బాధపడ్డాను. అప్పుడు బాగా కోపం వచ్చేది. ఎందుకు సినిమాలోకి అనవసరంగా వచ్చాను అనుకునేవాడిని అని తెలిపారు.
అలాగే.. నాకు ఒకసారి కాలికి దెబ్బ తగిలింది. నేను రెస్ట్ తీసుకున్నాను. అదే సమయంలో బాలకృష్ణకు కూడా కాలికి దెబ్బ తగిలింది. కానీ బాలయ్య షూటింగ్ కి వెళ్ళిపోయాడు. నా దగ్గరికి వచ్చి వెంకటేష్ లేచి షూటింగ్ వెళ్ళు అనేవాడు. దెబ్బలు తగిలినా పట్టించుకోడు. బాలయ్య తప్ప అలా ఎవరూ చేయలేరు అని చెప్పారు వెంకటేష్. దీంతో వెంకీమామ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
Also Read : Bobbili Raja : వంద పాములతో ఆ సీన్ చేశాను.. బొబ్బిలిరాజా సినిమా గురించి బాలయ్య షోలో వెంకటేష్ కామెంట్స్..
ఇక ఈ ఎపిసోడ్ కి వెంకటేష్ తో పాటు సురేష్ బాబు, అనిల్ రావిపూడి, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, భీమ్స్ సిసిరోలియో వచ్చి సందడి చేశారు. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వీరంతా వచ్చారు. ఈ సినిమా జనవరి 14న రిలీజ్ కానుంది. అప్పుడే జనవరి 12న బాలయ్య డాకు మహారాజ్ సినిమా కూడా రానుంది.