Malvi Malhotra : రాజ్ తరుణ్ కేసులో హీరోయిన్ పై ఆరోపణలు.. మరోవైపు స్పెషల్ సాంగ్ రిలీజ్..
తాజాగా మాల్వి మల్హోత్రా నటించిన ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ 'షహబానో..' విడుదల చేశారు.

Malvi Malhotra Released her Private Album Song after Raj Tharun Lavanya Issue
Malvi Malhotra : గత కొన్ని రోజులుగా రాజ్ తరుణ్ పై ఆరోపణలు చేస్తున్న లావణ్య అనే యువతి హీరోయిన్ మాల్వి మల్హోత్రాపై కూడా ఆరోపణలు చేస్తుంది. రాజ్ తరుణ్ – మాల్వి మల్హోత్రా రిలేషన్ లో ఉన్నారని, నన్ను వదిలేసి ఆమెని రాజ్ పెళ్లి చేసుకోబోతున్నాడని, మాల్వి నన్ను చంపేస్తానని బెదిరించిందని ఆరోపణలు చేస్తూ కేసు పెట్టింది. పోలీసులు ఆల్రెడీ మాల్వి పై కేసు కూడా నమోదు చేశారు.
అయితే ఈ గొడవలో మాల్వి పోలీస్ స్టేషన్ కి వచ్చి లావణ్య తప్పుడు ఆరోపణలు చేస్తుందని ఆమెపై కేసు పెట్టింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పటిదాకా రాజ్ తరుణ్, మాల్వి కనిపించలేదు. మాల్వి సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. మరోవైపు మాల్వి నటించిన ఓ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ ని కూడా రిలీజ్ చేసింది. ఓ పక్క రాజ్ తరుణ్ – లావణ్య ఇష్యూ పెద్దది అవుతున్నా అవేమి పట్టించుకోకుండా మాల్వి తన సినిమాలు, తన కెరీర్ పై ఫోకస్ చేయడం గమనార్హం.
Also Read : Raj Tharun – Lavanya : రాజ్ తరుణ్ లవర్ లావణ్య హై డ్రామా.. అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుంటున్నా అంటూ..
తాజాగా మాల్వి మల్హోత్రా నటించిన ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ ‘షహబానో..’ విడుదల చేశారు. ఆడు ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై హీరోయిన్ మాల్వి మల్హోత్రా మెయిన్ పాత్రలో గౌతమ్ చవాన్ నిర్మాతగా భాస్కర్ బంటుపల్లి దర్శకత్వంలో తెరకెక్కన ఈ ప్రైవేట్ సాంగ్ కి యశ్ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేశారు. హిమాలయాల్లో మంచులో ఈ పాటని అద్భుతంగా చిత్రీకరించారు. అంతే కాకుండా ఓ ఆసక్తికర పాయింట్ తో ఈ పాటని తెరకెక్కించి చివర్లో పార్ట్ 2 కూడా ప్రకటించడం గమనార్హం. ఈ పాటని సింగర్ సాకేత్ సంగీత దర్శకత్వంలో సింగర్ సోని పాడింది. ఈ పాటని తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల అయ్యింది. మీరు కూడా ఈ షహబానో సాంగ్ వినేయండి..