Premalu 2 : అప్పుడే ప్రేమలు 2 షూటింగ్ మొదలుపెట్టేశారుగా.. షూటింగ్ సెట్స్ నుంచి మమిత క్యూట్ ఫొటోలు రిలీజ్..
ప్రేమలు సినిమా పెద్ద హిట్ అయి భారీ కలెక్షన్స్ కూడా తేవడంతో ఈ సినిమాకి సీక్వెల్ ప్రకటించారు. అనౌన్స్ చేసిన నెల రోజుల్లోనే ప్రేమలు 2 షూటింగ్ మొదలుపెట్టేసారు.

Mamitha Baiju Premalu 2 Movie Shooting Started Photos Leaked from Sets
Premalu 2 : ఇటీవల మలయాళంలో పెద్ద హిట్ అయిన సినిమా ప్రేమలు. ఈ సినిమా తెలుగులో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేయగా ఇక్కడ కూడా పెద్ద హిట్ అయింది. ప్రేమలు సినిమా ఆల్మోస్ట్ 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన బెస్ట్ రామ్ కామ్ సినిమాల్లో ప్రేమలు ఒకటి. కామెడీ, లవ్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులని ఫుల్ గా నవ్వించి, క్యూట్ లవ్ ఎమోషన్ ని ఫీల్ అయ్యేలా చేసింది.
ప్రేమలు సినిమాకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ కి కనెక్ట్ అయ్యారు. ఇక ప్రేమలు సినిమాలో రీను పాత్ర చేసిన మమిత బైజు(Mamitha Baiju) ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. తెలుగులో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. నస్లెన్ గఫూర్, మమిత బైజు, అఖిల భార్గవన్, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్.. పలువురు ముఖ్య పాత్రల్లో గిరీష్ AD దర్శకత్వంలో ఫహద్ ఫాజిల్, అతని ఫ్రెండ్స్ నిర్మాణంలో తెరకెక్కింది ఈ ప్రేమలు సినిమా.
Also Read : Rana Daggubati : కల్కిలో రానా యాక్ట్ చేస్తున్నాడా? క్లారిటీ ఇచ్చేసిన రానా..
ప్రేమలు సినిమా పెద్ద హిట్ అయి భారీ కలెక్షన్స్ కూడా తేవడంతో ఈ సినిమాకి సీక్వెల్ ప్రకటించారు. ఇదే క్యారెక్టర్స్ తో ప్రేమలు 2 కొనసాగనుంది. ప్రేమలు 2 అనౌన్స్ చేసినా ఎప్పుడు మొదలుపెడతారో అనుకున్నారు. కానీ అనౌన్స్ చేసిన నెల రోజుల్లోనే ప్రేమలు 2 షూటింగ్ మొదలుపెట్టేశారని తెలుస్తుంది. తాజాగా ప్రేమలు హీరోయిన్ మమిత బైజు తన సోషల్ మీడియాలో ప్రేమలు 2 షూటింగ్ సెట్స్ నుంచి క్యూట్ ఫొటో దిగి పోస్ట్ చేసింది. ఆ ఫొటో షేర్ చేసి ప్రేమలు 2 అని పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫొటో వైరల్ గా మారింది.
Premalu ✌? pic.twitter.com/phjxAUXhUi
— Mamitha Baiju (@MamithaBaiju_) May 4, 2024
ఇంత తక్కువ సమయంలో ప్రేమలు 2 స్క్రిప్ట్ రాసేసి షూటింగ్ చేసేస్తున్నారంటే ఈ సంవత్సరమే పార్ట్ 2 రిలీజ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో ఈ సీక్వెల్ సినిమా కోసం మలయాళంతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
#Premalu2 Shooting Started
? Reenu – Karthika ?#MamithaBaiju #AkhilaBhargavan pic.twitter.com/nUXt4ijz5P
— Cinema Mania (@ursniresh) May 5, 2024