Wayback Photo: జూనియర్ ఆర్టిస్ట్‌గా ఫస్ట్ సినిమా.. అప్పుడు ఆయన పాదాలు తాకాను.. మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్!

సినిమాల్లో ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఫస్ట్ సినిమా ఎప్పుడూ ప్రత్యేకమే.. ఫస్ట్ సినిమా అవకాశం ఇచ్చినవారిపై ఎప్పటికీ కృతజ్ఞతాభావంతో ఉంటారు. మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి కూడా లేటెస్ట్‌గా వెండితెరపై తన ఫస్ట్ సీన్ జ్ఞాపకాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.

Wayback Photo: జూనియర్ ఆర్టిస్ట్‌గా ఫస్ట్ సినిమా.. అప్పుడు ఆయన పాదాలు తాకాను.. మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్!

Mammootty Gets Emotional As He Recalls His First Ever Appearance On Celluloid

Updated On : June 30, 2021 / 3:09 PM IST

Emotional post in INSTAGRAM: సినిమాల్లో ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఫస్ట్ సినిమా ఎప్పుడూ ప్రత్యేకమే.. ఫస్ట్ సినిమా అవకాశం ఇచ్చినవారిపై ఎప్పటికీ కృతజ్ఞతాభావంతో ఉంటారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కూడా లేటెస్ట్‌గా వెండితెరపై తన ఫస్ట్ సీన్ జ్ఞాపకాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఈమేరకు ఓ ఎమోషనల్ పోస్ట్ చేసిన మమ్ముట్టి, తన మొట్టమొదటి స్క్రీన్ ప్రజెన్స్‌కి సంబంధించిన ఫోటోను కలర్‌ఫుల్‌గా చేసినవారికి ధన్యవాదాలు తెలిపాడు.

Mammootty (1)

Mammootty (1)

ఎవరో తన అభిమాని బ్లాక్ అండ్ వైట్ కాలంలో తను జూనియర్ ఆర్టిస్ట్‌గా చేసిన సినిమాలో పిక్‌కు కలర్స్ అద్దాడు. కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ ఫోటో వైరల్ అవుతోంది. ఆ ఫోటోను షేర్ చేసుకున్న మమ్ముట్టి, ” ఈ ఫోటో నా మధురమైన జ్ఞాపకాలను తిరిగి గుర్తుకుతెచ్చింది. సత్యన్ మాస్టర్ నటించిన ఈ సినిమాలోనిది ఈ చిత్రం.. ఆయన నటించిన సినిమాలో కనిపించడం నా అదృష్టం. ఒకసారి సన్నివేశాల మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ సత్యన్ మాస్టర్ నిద్రపోతున్నప్పుడు, ఆయన పాదాలను తాకడం నాకు ఇంకా గుర్తుంది.” అంటూ తన అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు.

Mammootty

Mammootty

మమ్ముట్టి తొలిసారి 1971లో అనువవంగల్ పాలిచకల్ చిత్రంలో జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేశారు. ఈ చిత్రానికి కె.ఎస్.సేతుమాధవ దర్శకత్వం వహించారు. మలయాళ చిత్రసీమలో వెండితెరపై ఇదే మెగాస్టార్ మమ్ముట్టికి ఫస్ట్ సినిమా పాత్ర కూడా చిన్నదే. సత్యన్ మాస్టర్ ఈ సినిమాలో ప్రధానపాత్రలో నటించారు. సత్యన్ మాస్టర్ మలయాళ చిత్రసీమలో ప్రముఖ నటుడు. ఆయనకు చివరి సినిమా కూడా ఇదే. సత్యన్ మాస్టర్ చనిపోయి యాభై ఏళ్లు అయినా కూడా మలయాళ సినిమాలోకం ఆయనను ఆరాధిస్తూనే ఉంటారు.

 

View this post on Instagram

 

A post shared by Mammootty (@mammootty)

మమ్ముట్టి తెలుగులో కూడా దళపతి, యాత్ర వంటి సూపర్‌హిట్ సినిమాల్లో నటించగా.. త్వరలో సురేందర్ రెడ్డి ‘ఏజెంట్’ అనే సినిమాలో కూడా నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథను తెరకెక్కించగా.. ఆ సినిమాలో మమ్ముట్టి ముఖ్యమైన పాత్రలో నటించారు.