విజయ్ దేవరకొండ పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్న యువకుడు అరెస్ట్..
విజయ్ దేవరకొండ పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్న యువకుడిని పోలీసుల సహాయంతో పట్టుకున్న విజయ్ టీమ్..

విజయ్ దేవరకొండ పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్న యువకుడిని పోలీసుల సహాయంతో పట్టుకున్న విజయ్ టీమ్..
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తానే విజయ్ దేవరకొండ అని పరిచయం చేసుకుంటూ.. అమ్మాయిలను ట్రాప్ చేస్తూ మోసానికి పాల్పడుతున్న యువకుడిని సైబర్ క్రైం పోలీసుల సహాయంతో చాకచక్యంగా పట్టుకున్నారు విజయ్ దేవరకొండ టీమ్. మోసగాడి ఫోన్ నెంబర్‌ని కనిపెట్టి అతనితో ఒక అమ్మాయిలా పరిచయం చేసుకుని రివర్స్ ట్రాప్ చేయడం మొదలుపెట్టారు.
అతను చెప్పిన మాటలన్నీ నమ్మినట్లు నటించి నిన్ను వెంటనే కలవాలి అని హైదరాబాద్‌కి రమ్మని చెప్పడంతో.. ఈ మాటలన్నీ నమ్మిన ఆ మోసగాడు వెంటనే హైదరాబాద్ బయల్దేరి వచ్చాడు.. అంతే అప్పటికే పోలీసులతో రెడీగా ఉన్న విజయ్ దేవరకొండ టీమ్ అతడిని పట్టుకుని స్టేషన్‌కి తరలించారు.
ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు.. ఈ విచారణలో సదరు వ్యక్తి కామారెడ్డి జిల్లా బాన్స్ వాడ ప్రాంతానికి చెందిన వాడని తెలిసింది.. అంతేకాకుండా మరో ఇద్దరు హీరోలకు చెందిన మహిళా అభిమానులు పది మందిని కూడా ఇలానే మోసం చేసినట్లు విచారణలో వెల్లడైందని తెలుస్తుంది. ఇకముందు విజయ్ దేవరకొండ పేరుతో ఫేక్ ఐడీల నుండి మెసేజ్‌లు వచ్చినా ఎవరూ నమ్మొద్దని విజయ్ టీమ్ తెలియజేసింది.