Manchu Lakshmi : మంచు ఫ్యామిలీలో గొడ‌వ‌లు.. మంచు ల‌క్ష్మీ ఇన్‌స్టా పోస్ట్ వైర‌ల్‌.. మండిప‌డుతున్న నెటిజ‌న్లు..

మంచు ఫ్యామిలీలో జ‌రుగుతున్న గొడ‌వ టాలీవుడ్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Manchu Family Controversy Manchu Lakshmi latest post Viral

మంచు ఫ్యామిలీలో జ‌రుగుతున్న గొడ‌వ టాలీవుడ్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇక మంగ‌ళ‌వారం రాత్రి చాలా ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. మ‌నోజ్‌ను ఇంట్లోకి రానివ్వ‌కుండా గేటు వ‌ద్దే సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో మ‌నోజ్‌ బ‌ల‌వంతంగా గేటు తెరిచి లోప‌లికి వెళ్ల‌గా కొద్ది సేప‌టిలోనే చిరిగిన చొక్కాతో ఆయ‌న బ‌య‌ట‌కు వ‌చ్చారు.

ఈ స‌మ‌యంలో ఘ‌ట‌ను క‌వ‌ర్ చేసేందుకు వెళ్లిన మీడియా సిబ్బంది పై మోహ‌న్ బాబు దాడి చేశారు. ఈ ఘ‌ట‌న‌లో ఓ మీడియా ప్ర‌తినిధికి గాయాలు అయిన‌ట్లు తెలుస్తోంది. దీనిపై మోహ‌న్‌బాబు పై కేసు న‌మోదైంది. మ‌రోవైపు మోహ‌న్ బాబు గ‌చ్చిబౌలిలోని కాంటినెంట‌ల్ ఆస్ప‌త్రిలో చేరారు.

Manchu Vishnu : ‘తప్పే’.. నేను ఉండుంటే ఇలా జరిగేది కాదు.. మంచు విష్ణు

ఇలా మంచు ఫ్యామిలీలో ఎన్నో ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం అంద‌రి దృష్టి ఒక్క‌రిపైనే ప‌డింది. మంచు ఫ్యామిలీలో ఇంత జ‌రుగుతుంటే మోహ‌న్ బాబు కూతురు మంచు ల‌క్ష్మీ ఎక్క‌డ అనే ప్ర‌శ్న‌లు మొద‌లు అయ్యాయి. జ‌రుగుతున్న ప‌రిణామాల పై ఆమె ఎలా స్పందిస్తుంద‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. సోమ‌వారం జ‌ల్‌ప‌ల్లిలోని మోహ‌న్ బాబు నివాసానికి మంచు లక్ష్మీ వ‌చ్చి.. తండ్రితో మాట్లాడి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది.

కాగా.. మంచు ఫ్యామిలీలో జ‌రుగుతున్న ఘ‌ట‌న‌ల‌పై మంచు ల‌క్ష్మీ మాత్రం ఇంత వ‌ర‌కు స్పందించ‌లేదు. తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో కూతురి వీడియోను పోస్ట్ చేసి పీస్ అంటూ మాత్ర‌మే రాసుకొచ్చింది.

Manchu Manoj : ‘ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నా దాంట్లో తప్పేంటి’.. మనోజ్ ఎమోషనల్

మంచు ల‌క్ష్మీ తీరుపై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. తండ్రీ, అన్న‌ద‌మ్ముల మ‌ధ్య ఇంత జ‌రుగుతుంటే వారి మధ్య స‌యోధ్య కుదిర్చే ప్ర‌య‌త్నం చేయ‌కుండా ఇన్‌స్టాపోస్ట్‌ల‌తో బీజీగా ఉంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆస్తిలో త‌న‌కు రావాల్సింది తీసుకుని ముంబైలో సెటిల్ అయింద‌ని, అందుక‌నే గొడ‌వ‌ల‌పై స్పందించ‌డం లేద‌నే రూమ‌ర్లు వినిపిస్తున్నాయి.