Manchu Vishnu : ‘తప్పే’.. నేను ఉండుంటే ఇలా జరిగేది కాదు.. మంచు విష్ణు

మోహన్ బాబు మీడియాతో వ్యవహరించిన తీరుపై ప్రెస్ మీట్ పెట్టి స్పందించారు మంచు విష్ణు.

Manchu Vishnu : ‘తప్పే’.. నేను ఉండుంటే ఇలా జరిగేది కాదు.. మంచు విష్ణు

Manchu Vishnu About Manchu Family Dispute

Updated On : December 11, 2024 / 2:41 PM IST

Manchu Vishnu : మంచు కుటుంబంలో జరుగుతున్న రచ్చ గురించి తెలిసిందే. నిన్న రాత్రి నుండి మంచు ఇంట గొడవ రోడ్డుకెక్కింది. మంచు ఇంట గొడవ తీవ్ర రూపం దాల్చడంతో విష్ణు రంగంలోకి దిగాడు. మనోజ్ , మోహన్ బాబు ఇద్దరూ గొడవకి దిగడంతో విష్ణు దుబాయ్ నుండి హైదరాబాద్ కి చేరుకున్నారు.

Also Read : Manchu Vishnu : మా నాన్న చేసిన తప్పు అదే..మంచు విష్ణు

ఇక నిన్న మోహన్ బాబు మీడియాతో ప్రవర్తించిన తీరు పై మండిపడుతున్నారు రెండు రాష్ట్రాల ప్రజలు. కవరేజ్ కోసం మంచు ఇంటికి వెళ్లిన మీడియా ప్రతినిధిపై చెయ్యి చేసుకోవడంపై ఈ విషయం రచ్చకెక్కింది. కాగా ఈ గొడవలో మోహన్ బాబు కి కూడా పలు చిన్న గాయాలు అయ్యాయి. ఇందుకుగాను మోహన్ బాబు ను నిన్న హాస్పిటల్ లో జాయిన్ చేశారు. తాజాగా ఆయన హెల్త్ బులిటెన్ కూడా రిలీజ్ చేశారు. ఆయన చాలా నీరసంగా, బీపీ, తక్కువగా ఉందని చెప్పారు.

తాజాగా మోహన్ బాబు మీడియాతో వ్యవహరించిన తీరుపై ప్రెస్ మీట్ పెట్టి స్పందించారు మంచు విష్ణు. ‘జర్నలిస్టుపై దాడి నిజంగా బాధగా ఉంది. జర్నలిస్ట్‌పై దాడిని ఖండిస్తున్నా. మా నాన్న గారు తప్పు చేసుంటే క్షమించాలి. ఆయన కావాలని అలా చెయ్యలేదు. ఎన్నో ఏళ్లుగా మీరు ఆయన్ని చూస్తున్నారు. ఆయన మీడియాతో ఎంత గౌరవంగా ఉంటారో మనకి తెలుసు. ఆ వీడియో మీరు ఒకసారి చూడండి మీకే తెలుస్తుంది. ఉమ్మడి కుటుంబంలో కొన్ని గొడవలు వస్తాయి. మెల్లగా సర్దుకుంటాయని. నేను అసలు ఇక్కడే ఉండుంటే ఇది జరిగేది కాదని, మమ్మల్ని అతిగా ప్రేమించటమే మా నాన్న చేసిన తప్పు. మేం కలిసిమెలసి ఉందామని అనుకున్నామని విష్ణు అన్నారు.