Manchu Manoj – Bhuma Mounika : చెన్నైలో మనోజ్ మౌనిక ఏడాదిన్నర పాటు సహజీవనం.. 15 ఏళ్ళ స్నేహం!

మనోజ్ అండ్ మౌనిక పెళ్ళైన తరువాత మొదటిసారి ఒక టీవీ షోకి హాజరయ్యారు. ఈ షోలో తమ పరిచయం మరియు బంధం గురించి ఎన్నో తెలియని విషయాలను బయట పెట్టారు.

Manchu Manoj – Bhuma Mounika : చెన్నైలో మనోజ్ మౌనిక ఏడాదిన్నర పాటు సహజీవనం.. 15 ఏళ్ళ స్నేహం!

Updated On : April 19, 2023 / 8:09 PM IST

Manchu Manoj – Bhuma Mounika : మంచు మనోజ్ ప్రముఖ దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికని ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. వీరిద్దరి పెళ్లి వార్త సినీ, రాజకీయ రంగంలో పెద్ద చర్చనీయాంశం అయ్యింది. పెళ్లి తరువాత కూడా మంచు కుటుంబంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా ఈ కొత్త జంట పెళ్ళైన తరువాత మొదటిసారి ఒక టీవీ షోకి హాజరయ్యారు.

Manchu Manoj : స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ రైటర్ కలయికలో మంచు మనోజ్ పెళ్లి సాంగ్..

ప్రముఖ తెలుగు టెలివిజన్ లో టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ వ్యాఖ్యాతగా ఒక టాక్ షో మొదలైంది. ఇక ఈ షోలో పాల్గొన్న మనోజ్ అండ్ మౌనిక తమ పరిచయం మరియు బంధం గురించి ఎన్నో తెలియని విషయాలను బయట పెట్టారు. ఈ క్రమంలోనే మొదట ఎక్కడ కలుసుకున్నారో చెప్పారు. 15 ఏళ్లగా తమ ఇద్దరి కుటుంబాలు మధ్య స్నేహం బంధం ఉందని, ఇరు కుటుంబాల్లోని మంచీ చెడులకు కూడా తప్పకుండా హాజరయ్యేవారని తెలియజేశారు. ఆ సమయంలోనే వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడినట్లు చెప్పుకొచ్చారు.

Ram Charan – Manchu Manoj : మంచు మనోజ్‌కి స్పెషల్ గిఫ్ట్ పంపించిన రామ్ చరణ్.. ఏంటో తెలుసా?

మంచు మనోజ్ మాట్లాడుతూ.. “అయితే ఇద్దరం మరొకరితో ఏడడుగులు వేసి వేరే దారుల్లో ప్రయాణించాం. ఇక విడాకులు తరువాత ఇద్దరం కలిసి ప్రయాణించాలని అని డిసైడ్ అయినప్పుడు చాలా ప్రాబ్లెమ్స్ పేస్ చేసాం. నా కోసం ఒక బిడ్డతో ఎదురు చూస్తున్న ఆమె కోసం సినిమాని కూడా వదిలేసి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. అలా నేను చేస్తున్న అహం బ్రహ్మాస్మి సినిమాని మధ్యలో వదిలేసి మౌనికను తీసుకోని చెన్నై వెళ్ళిపోయాను. అక్కడే ఏడాదిన్నర పాటు జీవించాం. ఈ విషయం ఎవరికి తెలియదు” అంటూ చెప్పుకొచ్చాడు. కాగా గతంలో వీరిద్దరి సహజీవనం గురించి మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్‌ రావు ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బయట పెట్టారు. ఇప్పుడు మనోజ్ స్వయంగా ఈ విషయాన్ని అంగీకరించాడు.