Manchu Manoj – Bhuma Mounika : ఎవరు ఫస్ట్ ప్రొపోజ్ చేసారో తెలుసా.. అంతా సినిమా మాదిరి సీన్స్!
మనోజ్ అండ్ మౌనిక ప్రేమలో ఎవరు ఫస్ట్ ప్రొపోజ్ చేసారో తెలుసా? ఆ తరువాత జరిగిన సంఘటనలు ఉప్పెన సినిమాలోని సీన్స్ ని తలపిస్తాయి.

Manchu Manoj Bhuma Mounika love story reveal
Manchu Manoj – Bhuma Mounika : మంచు వారసుడు మనోజ్, భూమా వారసురాలు మౌనిక ఇటీవల పెళ్లి చేసుకోవడం సినీ, రాజకీయ రంగంలో పెద్ద చర్చినీయాంశం అయ్యింది. వీరిద్దరికి ఇది రెండో వివాహం. గతంలో మనోజ్ అండ్ మౌనిక విడివిడిగా వివాహం చేసుకున్నారు. మౌనిక ఒక బాబుకి కూడా జన్మించింది. అయితే విభేదాలతో విడాకులు తీసుకుంది. మనోజ్ కూడా తన భార్య ప్రణతి నుంచి విడిపోయాడు. ఆ తరువాత వీరిద్దరూ ప్రేమలో పడడం, పెళ్లి వరకు చేరుకోవడం గురించి మనోజ్ అండ్ మౌనిక ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.
Manchu Manoj – Bhuma Mounika : చెన్నైలో మనోజ్ మౌనిక ఏడాదిన్నర పాటు సహజీవనం.. 15 ఏళ్ళ స్నేహం!
పెళ్ళైన తరువాత మొదటిసారి ఈ కొత్త జంట.. టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఒక టీవీ షోకి హాజరయ్యారు. ఈ షోలో వెన్నెల కిషోర్ ఇద్దరిలో ఎవరు ఫస్ట్ ప్రొపోజ్ చేశారు అని ప్రశించాడు. దీనికి మనోజ్ బదులిస్తూ.. “నేనే మొదటి ప్రొపోజల్ పెట్టాను. నా లైఫ్ లో నేను ఎదురుకున్న సమస్యలే పెద్దవి అనుకున్నాను. కానీ ఆ తరువాత మౌనిక ఎదురుకుంటున్న కష్టాలు చూసి నా చాలా చిన్నవి అనిపించాయి. దీంతో ఆమె పై గౌరవం పెరిగిందని” చెప్పుకొచ్చాడు. ఆ తరువాత ఆమెకు ప్రొపోజ్ చేశాడట.
Ram Charan – Manchu Manoj : మంచు మనోజ్‌కి స్పెషల్ గిఫ్ట్ పంపించిన రామ్ చరణ్.. ఏంటో తెలుసా?
“నువ్వంటే నాకు ఇష్టం, ప్రాణం. నాకు జీవితంలో హ్యాపీగా బ్రతకాలని ఉంది. నా జీవితంలో మళ్ళీ సంతోషం, ఆశ, వెలుగు వస్తున్నాయి అంటే అది నీవల్లే. నువ్వు ఒప్పుకుంటే నీతో పాటు నీ బాబుని కూడా నా జీవితంలోకి ఆహ్వానిస్తా అని చెప్పా” అంటూ మనోజ్ చెప్పుకొచ్చాడు. ఇక మనోజ్ ప్రొపోజల్ కి మౌనిక బదులిస్తూ.. నువ్వు ఆలోచించే చెబుతున్నావా? ఈ సొసైటీ ఏమనుకుంటుందో ఆలోచించావా? అంతెందుకు మన ఇంటిలో ఒప్పుకుంటారా? అని అడిగిందట.
Manchu Manoj : స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ రైటర్ కలయికలో మంచు మనోజ్ పెళ్లి సాంగ్..
మనోజ్ దానికి స్పందిస్తూ.. “సమాజం అనే మాటల్ని నేను పట్టించుకోను. ఇక మా ఇంటిలో నాకు నో చెప్పారు. అవన్నీ నేను చూసుకుంటా” అంటూ బదులిచ్చాడు. ఇక మనోజ్ మాటలకి మౌనిక కూడా ఓకే చెప్పేసిన తరువాత తమ వనవాసం మొదలైనట్లు చెప్పుకొచ్చాడు. ఉప్పెన సినిమాలోని ఈశ్వర సాంగ్ మాదిరి దేశ దేశాలు తిరిగినట్లు, ఎన్నో సమస్యలు ఎదురుకున్నట్లు వెల్లడించాడు. మొత్తం జరిగింది అంతా చెబితే సీజన్లు ప్లాన్ చేయవచ్చు అంటూ వ్యాఖ్యానించాడు.