Manchu Manoj : నా మీద కేసులు పెట్టారు.. వాళ్ళ ఆస్తులు నాకు వద్దు.. ఇది అన్నదమ్ముల గొడవ.. మంచు వివాదాలపై మనోజ్ వ్యాఖ్యలు..
ఓ ఇంటర్వ్యూలో మనోజ్ ఈ వివాదం గురించి మాట్లాడాడు.

Manchu Manoj Comments on Manchu Family Manchu Vishnu Issue
Manchu Manoj : గత కొన్ని రోజులుగా మనోజ్ – మంచు ఫ్యామిలీ మధ్య వివాదాలు నడుస్తూ మీడియా ముందుకు, పోలీసుల ముందుకు వచ్చి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ వివాదాలపై విష్ణు, మనోజ్ ఏదో ఒక కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఒకరిపై ఒకరు కౌంటర్లు కూడా వేసుకుంటున్నారు. ఒకరు ఆస్తి గొడవలు అంటే, ఒకరు కాలేజీ సమస్యల గొడవలు అని చెప్తున్నారు.
చాలా గ్యాప్ తర్వాత మనోజ్ భైరవం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా మే 30న రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మనోజ్ ఈ వివాదం గురించి మాట్లాడాడు.
Also Read : Spirit : ‘స్పిరిట్’ హీరోయిన్ అధికారికంగా అనౌన్స్.. అందర్నీ పక్కన పెట్టి.. యానిమల్ భామకు గోల్డెన్ ఛాన్స్..
మనోజ్ మాట్లాడుతూ.. నా మీద వాళ్ళు కేసులు పెట్టారు కానీ నేను ఎవరి మీద కేసులు పెట్టలేదు. నా మీద దాడికి వస్తేనే నేను మీడియా, పోలీసుల ముందుకు వచ్చాను. నా భార్య పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది. నేను ఏమి తప్పు చేయలేదు కాబట్టి సైలెంట్ గా ఉండట్లేదు. వాళ్ళు నన్ను టార్గెట్ చేసినా వాళ్ళ మీద కోపం రావట్లేదు, రాదు కూడా. మా అందర్నీ మళ్ళీ ఒక టేబుల్ మీద కూర్చొని మాట్లాడటం నేను చూడాలి అని దేవుడ్ని దండం పెట్టుకుంటాను అని అన్నారు.
అలాగే.. మా నాన్నని నేను ఎప్పుడూ ఏం అనలేదు. ఇది అన్నదమ్ముల మధ్య జరిగింది. కానీ ఇది మా నాన్నకు నాకు మధ్య జరిగింది అన్నట్టు బయటకి చూపించారు. ఆయన డబ్బు, లెగసీ నేను అడగను. అది ఆయన కష్టం. మా నాన్నని ఉద్దేశించి చేయాలని కాదు. నేను నీతిగానే ఉంటాను. ఆయన నేర్పించింది ఇదే. ఆయన చుట్టూ ఉన్నవాళ్లు ఆయన్ని మార్చారు. నేను మారలేదు. నా ఫ్యామిలీ పేరు మీద గౌరవం ఉంది కాబట్టే నేను మళ్ళీ సినిమాలు చేస్తూ నా బాధ్యత నిర్వహిస్తున్నాను. నాకు మా పెద్దల ఆస్తులు ఏం వద్దు. సినిమాల మీద నుంచి వచ్చేదే నా ఆదాయం. నా భార్య కూడా బిజినెస్ చేస్తుంది. ఆమె కూడా వాళ్ళ పెద్దల ఆస్తులు తీసుకోదు అని తెలిపారు. దీంతో మనోజ్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Also Read : Adivi Sesh : వామ్మో అడివి శేష్ సినిమాకు.. మ్యూజిక్ రైట్స్ కి అన్ని కోట్లా?