భార్యతో విడాకులు .. మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్

యంగ్ హీరో మంచు మనోజ్, తన భార్య ప్రణతితో విడాకులు తీసుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించాడు.. ఇక ముందు బాధనంతటినీ పక్కన పెట్టేసి కెరీర్‌పై దృష్టి పెడతానని తెలిపాడు..

  • Published By: sekhar ,Published On : October 17, 2019 / 12:22 PM IST
భార్యతో విడాకులు .. మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్

Updated On : October 17, 2019 / 12:22 PM IST

యంగ్ హీరో మంచు మనోజ్, తన భార్య ప్రణతితో విడాకులు తీసుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించాడు.. ఇక ముందు బాధనంతటినీ పక్కన పెట్టేసి కెరీర్‌పై దృష్టి పెడతానని తెలిపాడు..

యంగ్ హీరో మంచు మనోజ్, తన భార్య ప్రణతితో విడాకులు తీసుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. గతంలోనే మనోజ్ తన భార్యతో కలిసి ఉండడంలేదని వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు స్వయంగా మనోజ్ వివరణ ఇచ్చాడు. ఇప్పుడు తను డివోర్స్ తీసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశాడు.

తన పెళ్లి డివోర్స్‌తో ముగుస్తుందని ఎమోషనల్‌గా రాసుకొచ్చాడు. ఇద్దరి మధ్య కొన్ని విభేదాలు తలెత్తడంతోనే విడిపోవలసి వస్తుందని.. ఇద్దరికీ ఒకరిపై ఒకరికి గౌరవం ఉన్నా కలిసి జీవించలేమని క్లారిటీగా చెప్పేశాడు. మనసు బాగోలేక పోవడం వల్లే ఇన్ని రోజులూ పని మీద ఫోకస్ పెట్టలేకపోయానని, ఇక ముందు బాధనంతటినీ పక్కన పెట్టేసి కెరీర్‌పై దృష్టి పెడతానని.. తన బాధ అంతటిలో తన కుటుంబం తనకు తోడుగా నిలిచిందని మనోజ్ తన పోస్ట్‌లో వివరించాడు.

Read Also : రమేష్ (ఐమ్యాక్స్) ప్రసాద్‌కు సతీ వియోగం

2015లో మనోజ్, ప్రణతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. పెళ్లైన కొద్ది రోజులనుండే వీళ్లిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. చివరకిలా విడాకులతో శాశ్వతంగా విడిపోయారు. మనోజ్ చేసిన పోస్ట్ చూసి, ‘జీవితంలో ఇలాంటివి జరుగుతుంటాయి.. ధైర్యంగా ఉండాలి.. త్వరలోనే నిన్ను బిగ్ స్క్రీన్‌పై చూడాలి.. అంటూ ఫ్యాన్స్ అండ్ నెటిజన్స్ అతనికి మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు.