Manchu Manoj – Bhuma Mounika : వాళ్ళిద్దరికీ జీవితాంతం రుణపడి ఉంటాను.. మంచు మనోజ్!
వెన్నెల కిషోర్ టాక్ షోకి హాజరయ్యిన మంచు మనోజ్.. తన ప్రేమ, పెళ్లి ప్రయాణంలో వారిద్దరే ఎంతో సహాయ పడ్డారని తెలియజేశాడు. వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉంటాను..

Manchu Manoj emotional comments on manchu lakshmi and his mother
Manchu Manoj – Bhuma Mounika : మంచు వారసుడు మంచు మనోజ్.. ప్రముఖ దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికని ఇటీవల పెళ్లి చేసుకున్న విషయం ప్రత్యేకంగా ప్రస్తావించనవసరం లేదు. వీరిద్దరికి ఇది రెండో పెళ్లి కావడం సినీ, రాజకీయ రంగంలో పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ఈ పెళ్లి తరువాత మంచు కుటుంబంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా ఒక టెలివిజన్ టాక్ షోకి హాజరైన ఈ కొత్త జంట.. వారిద్దరి ప్రేమ, పెళ్లి విషయంలో ఎదురుకున్న సమస్యలను చెప్పుకొచ్చారు.
Manchu Manoj – Bhuma Mounika : ఎవరు ఫస్ట్ ప్రొపోజ్ చేసారో తెలుసా.. అంతా సినిమా మాదిరి సీన్స్!
వెన్నెల కిషోర్ హోస్ట్ గా వ్యవరిస్తున్న టాక్ షోలో పాల్గొన్న మనోజ్ మాట్లాడుతూ.. “మేమిద్దరం కలిసి నడుద్దాం అని అనుకున్నప్పుడు ఎన్నో సమస్యలు ఎదురుకున్నాం. అవన్నీ చెబితే మరో సీజన్ కూడా కావాలి, ఒక్కో కథ ఒక్కో ఎపిసోడ్ పడుతుంది. మాటల్లో మాట్లాడుకునేంత ఈజీగా మా లైఫ్ సాగలేదు. ఎన్ని డోర్లు మూస్తారో మూయండి అంటూ ముందుకు సాగాం. అయితే మా ప్రేమ, పెళ్లి ప్రయాణంలో మా అమ్మ, అక్క (Manchu Lakshmi) ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మా ఇద్దరికీ వాళ్లిద్దరే అండగా నిలబడ్డారు. ఇక మా ఇద్దరి పెళ్లి బాధ్యత మొత్తం అక్కే తీసుకుంది. నా వల్ల వాళ్లిద్దరూ బాధ పడుతున్నారని ఫీల్ అయ్యేవాడిని. అప్పుడే అనుకున్నా జీవితాంతం అమ్మ, అక్కకి కష్టం రాకుండా చూసుకోవాలని” అంటూ చెప్పుకొచ్చాడు.
Manchu Manoj – Bhuma Mounika : చెన్నైలో మనోజ్ మౌనిక ఏడాదిన్నర పాటు సహజీవనం.. 15 ఏళ్ళ స్నేహం!
ఇక ఇదే షోలో మౌనిక, మంచు లక్ష్మితో తన అనుబంధాన్ని తెలియజేసింది. “ఆమె నాకు సిస్టర్ అండ్ ఫ్రెండ్ గా కాకుండా అమ్మ స్థానంలో నిలబడింది. నన్ను ఒక చిన్న పిల్లలా ట్రీట్ చేస్తుంటుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే నాకు అన్ని ఆమె” అంటూ చెప్పుకొచ్చింది.