Ustaad Promo : ‘ఉస్తాద్’ కొత్త ప్రోమో చూశారా? ఈసారి మంచు మనోజ్ తో డీజే టిల్లు సందడి..
మంచు మనోజ్(Manchu Manoj) ‘ఉస్తాద్’ సెలబ్రిటీ షోలో మొదటి ఎపిసోడ్ నాని(Nani) వచ్చి సందడి చేయగా ఈసారి సెకండ్ ఎపిసోడ్ లో డీజే టిల్లు ఫేమ్ సిద్ధూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) వచ్చి సందడి చేశారు.

Manchu Manoj Show Ustaad Second Episode Promo Released with Siddhu Jonnalagadda Guest
Ustaad Promo : మంచు మనోజ్(Manchu Manoj) హోస్ట్ గా చేస్తూ ‘ఉస్తాద్’ అనే సెలబ్రిటీ షోని ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చాడు. ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఈ విన్’లో ఈ షో ప్రసారం అవుతుంది. మొదటి ఎపిసోడ్ లో నాని(Nani) వచ్చి సందడి చేయగా ఈసారి సెకండ్ ఎపిసోడ్ లో డీజే టిల్లు ఫేమ్ సిద్ధూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) వచ్చి సందడి చేశారు. తాజాగా రెండో ఎపిసోడ్ కి సంబంధిచిన ప్రోమో రిలీజ్ చేశారు.
Also Read : Salaar Interview : రాజమౌళితో సలార్ స్పెషల్ ఇంటర్వ్యూ వచ్చేసింది.. ఫుల్ ఇంటర్వ్యూ చూశారా?
ప్రోమో ఆద్యంతం సరదాగా సాగింది. మంచు మనోజ్ సిద్ధూతో కలిసి ఫుల్ ఎంటర్టైన్ చేశాడు. సిద్ధూ అన్ని సినిమాల్లోని లిప్ కిస్ ఇస్తాడని, డీజే టిల్లు రాధికల్లాగా రియల్ లైఫ్ లో ఎవరన్నా తగిలారా అంటూ పలు సరదా ప్రశంలు, సీరియస్ గా సాగే గేమ్స్ తో ప్రోమో ఆసక్తిగా ఉంది. అన్ని షోల లాగా కాకుండా మంచు మనోజ్ ఇష్టమొచ్చినట్టు సెట్ లో తిరిగేస్తూ, పడుకుంటూ ఫుల్ గా అల్లరి చేశారు. దీంతో ఇది షోల లేదు, మనోజ్ ఇల్లులా ఉంది అని సిద్ధూ సరదాగా అన్నాడు.
#Ustaad Rampage ki mana favourite DJ Tillu #siddujonnalagada base ekkuvaa iyi Boxlu baddalaipoya entertaining episode, Premieres Dec 21 on #EtvWin.?
Promo Out Now! ?
▶️ https://t.co/0cpiMJPSmu
.
.
.
.@etvwin @peoplemediafcy#MM #DjTillu #EtvWin #WinThoWinodham pic.twitter.com/E34J43Yari— Manoj Manchu??❤️ (@HeroManoj1) December 19, 2023