Salaar Interview : రాజమౌళితో సలార్ స్పెషల్ ఇంటర్వ్యూ వచ్చేసింది.. ఫుల్ ఇంటర్వ్యూ చూశారా?

కేవలం రాజమౌళి(Rajamouli).. ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృథ్విరాజ్ సుకుమారన్ లతో ఓ ఇంటర్వ్యూ చేశారు.

Salaar Interview : రాజమౌళితో సలార్ స్పెషల్ ఇంటర్వ్యూ వచ్చేసింది.. ఫుల్ ఇంటర్వ్యూ చూశారా?

Rajamouli Special Interview with Prabhas Prithviraj Prashanth Neel for Salaar Movie Promotions

Updated On : December 20, 2023 / 11:17 AM IST

Salaar Interview : ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) హీరోగా తెరకెక్కిన సలార్(Salaar) పార్ట్ 1 సినిమా డిసెంబర్ 22న గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. సలార్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సలార్ సినిమాకి అసలు ప్రమోషన్స్ చెయ్యట్లేదు చిత్ర యూనిట్. కానీ కేవలం రాజమౌళి(Rajamouli).. ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృథ్విరాజ్ సుకుమారన్ లతో ఓ ఇంటర్వ్యూ చేశారు.

Also Read :  ‘సలార్’ దెబ్బకి ‘డంకీ’ పని అయిపోయినట్టే.. మొదటి రోజు ఎవరికి ఎన్ని కోట్లు వస్తాయంటే..

ఇటీవల ఆ ఇంటర్వ్యూ నుంచి ప్రోమో రిలీజ్ చేయగా తాజాగా ఫుల్ ఇంటర్వ్యూ రిలీజ్ చేశారు. ప్రమోషన్స్ ఏమి లేకపోవడంతో ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రభాస్ అభిమానులు ఈ ఇంటర్వ్యూని ప్రస్తుతం వైరల్ చేస్తున్నారు. రాజమౌళి.. ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృథ్విరాజ్ సుకుమారన్ లని పలు ప్రశ్నలు అడిగారు. కేజిఎఫ్, సలార్, బాహుబలి సినిమాల గురించి, వాటి మేకింగ్స్ గురించి, ప్రభాస్ గురించి, సలార్ సెట్ లో జరిగిన సంఘటనలు.. ఇలా అనేక సంగతులు ఈ ఇంటర్వ్యూలో ముచ్చటించారు.