Salaar Vs Dunki : సలార్, డంకీ.. మొదటి రోజు ఏ సినిమాకు ఎన్ని కోట్లు వస్తాయంటే..?

ప్రభాస్(Prabhas) సలార్ సినిమా, షారుఖ్(Shah Rukh Khan) డంకీ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద క్లాష్ అవ్వనున్నాయి.

Salaar Vs Dunki : సలార్, డంకీ.. మొదటి రోజు ఏ సినిమాకు ఎన్ని కోట్లు వస్తాయంటే..?

Prabhas Salaar Vs Shah Rukh Khan Dunki First Day Collections Expectations

Updated On : December 20, 2023 / 11:26 AM IST

Salaar Vs Dunki : ప్రభాస్(Prabhas) సలార్ సినిమా, షారుఖ్(Shah Rukh Khan) డంకీ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద క్లాష్ అవ్వనున్నాయి. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన డంకీ సినిమా డిసెంబర్ 21న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ పార్ట్ 1 సినిమా డిసెంబర్ 22న రిలీజ్ కాబోతుంది. దీంతో ఏ సినిమాకి ఎన్ని కోట్ల కలెక్షన్స్ వస్తాయో అని లెక్కలు వేసుకుంటున్నారు ట్రేడ్ వర్గాలు, అభిమానులు.

షారుఖ్ పఠాన్, జవాన్ లాంటి యాక్షన్ మాస్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సక్సెస్ అయ్యాడు. కానీ ఇప్పుడు వచ్చే డంకీ ఎమోషనల్ డ్రామా. దీనికి ఆ రేంజ్ కలెక్షన్స్ రాకపోవచ్చు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతే కాకుండా డంకీ కేవలం హిందీ భాషలోనే రిలీజ్ అవుతుంది. దీంతో డంకీకి సౌత్ లో కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. కానీ ప్రభాస్ సలార్ సినిమా హిందీతో పాటు సౌత్ లోని నాలుగు భాషల్లో రిలీజ్ అవుతుంది. ఇది సలార్ కి బాగా కలిసొచ్చే అంశం. అంతే కాకుండా ఇది పక్కా మాస్ యాక్షన్ సినిమా, ప్రభాస్ వరుస ఫ్లాప్స్ లో ఉండటం, ఈ సినిమా మీద అభిమానులకు భారీ అంచనాలు ఉండటం.. ఇవన్నీ సలరా కి భారీ కలెక్షన్స్ తెచ్చిపెడతాయని భావిస్తున్నారు.

సినిమా ట్రేడ్ వర్గాల ప్రకారం డంకీ సినిమా మొదటి రోజు 80 నుంచి 100 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తుంది. సలార్ సినిమా మాత్రం దాదాపు 150 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుందని సమాచారం. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా డంకీ మొదటి రోజు 2 కోట్లు కలెక్ట్ చేసింది అడ్వాన్స్ బుకింగ్స్ తో. ఇక సలార్ తెలుగు బుకింగ్స్ లేకుండానే 2 కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. నిన్న రాత్రే తెలుగు సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా బుక్ మై షో, పేటీఎం యాప్స్ ఒక్కసారిగా క్రాష్ అయ్యాయి. అంతలా అభిమానులు టికెట్స్ కోసం ఎదురు చూస్తున్నారు.

Also Read : బిగ్‌బాస్‌లో అలా.. కప్పు గెలిచాక ఇలా.. రైతులకు హెల్ప్ చేయడానికి నేనేమన్నా సీఎంనా?

ఇప్పటికి మొదటి రోజు కలెక్షన్స్ లో ప్రభాస్ ఆదిపురుష్ సినిమానే టాప్ లో ఉంది. ఆదిపురుష్ సినిమా మొదటి రోజు 140 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. షారుఖ్ పఠాన్ మొదటి రోజు 60 కోట్లు, జవాన్ మొదటి రోజు 129 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ లెక్కన చూస్తే ప్రభాస్ సలార్ తో తన రికార్డ్ తానే బద్దలుకొడతాడని అనుకుంటున్నారు. మరి డంకీ సౌత్ భాషల్లో లేకుండా మొదటి రోజు ఎన్ని కలెక్షన్స్ వస్తాయో చూడాలి. మొత్తానికి సలార్ దెబ్బకి ఈసారి డంకీ పని అయిపోతుంది అని అభిమానులు అంటున్నారు.

Also Read : రాజమౌళితో సలార్ స్పెషల్ ఇంటర్వ్యూ వచ్చేసింది.. ఫుల్ ఇంటర్వ్యూ చూశారా?