Manchu Mnaoj : నాకు సపోర్ట్ చేసే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు.. బౌన్సర్లు తాగేసి.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్..
ఈ ఘటనపై నేడు మంచు మనోజ్ సంఘటన స్థలానికి వెళ్లి మీడియాతో మాట్లాడాడు.

Manchu Mnaoj Sensational Comments on Mohan Babu Related Bouncers
Manchu Mnaoj : మంచు మనోజ్ – మంచు ఫ్యామిలీ మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మంచు ఫ్యామిలీ ఆస్తి గొడవలు అంటే, మనోజ్ మాత్రం యూనివర్సిటీ సమస్యలు, స్టూడెంట్స్ సమస్యలు అంటున్నాడు. వీరి వివాదం పోలీసుల వద్దకు, కలక్టరేట్ వద్దకు కూడా వెళ్ళింది. తాజాగా మరోసారి మంచు మనోజ్ సంచలనం కామెంట్స్ చేసాడు.
నిన్న మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ఉన్న ఓ హోటల్ పై మోహన్ బాబుకు సంబంధించిన బౌన్సర్లు, పలువురు వ్యక్తులు దాడి చేసారు. ఈ ఘటనపై నేడు మంచు మనోజ్ సంఘటన స్థలానికి వెళ్లి మీడియాతో మాట్లాడాడు.
మంచు మనోజ్ మాట్లాడుతూ.. నిన్న రాయచోటిలోని ఓ సినిమా ఈవెంట్ కి వెళ్ళాను. నిన్నంతా అక్కడే ఉన్నాను. నేను ఈ ప్రాంతంలో ఉన్నాను అని తెలిసి ఇక్కడ నుంచి నాకు సపోర్ట్ చేసే వాళ్లపై దాడులు చేసారు. ఇక్కడ హాస్టల్స్ పెట్టుకొని కొంతమంది బతుకుతుంటే వాళ్లపై కొంతమంది దాడులు చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. దీని గురించి నేను ప్రశ్నిస్తే నా మీద ఇలాంటి అభాండాలు వేస్తున్నారు. నన్ను, నా వైఫ్, తల్లి పై అభాండాలు వేస్తున్నారు. నా దగ్గర అన్ని ప్రూఫ్ లు ఉన్నాయి. ఇక్కడ ఉన్న నా మనుషులు కంగారు పడుతున్నారు. హేమాద్రి నాయుడు అనే వ్యక్తి ఇవన్నీ చేస్తున్నాడు. ఆయన మనుషులు మా వాళ్లపై దాడులు చేస్తున్నారు అని అన్నారు.
Also Read : టాలీవుడ్‌లో విషాదం.. హీరో తండ్రి కన్నుమూత
అలాగే.. మరోసారి చెప్తున్నాను. ఇది ఆస్తి గొడవలు కాదు. ఆత్మ గౌరవం గురించి. నేను, ఇక్కడ దాడులకు గురయిన వాళ్ళు కలిసి పోలీసుల దగ్గరికి వెళ్లి కంప్లైంట్ చేస్తాము. బౌన్సర్లు వచ్చి దాడి చేసిన సీసీ కెమెరా విజువల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ బౌన్సర్లు తాగేసి రాత్రుళ్ళు గొడవలు చేస్తున్నారు. ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇక్కడ ప్రజలను, స్టూడెంట్స్ ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు బౌన్సర్లు. ఎమ్మెల్యే గారిని కూడా కలవడానికి ట్రై చేస్తున్నాను. నాన్న గారు యూనివర్సిటీ మేనేజ్మెంట్ చూసినంత కాలం ఇక్కడ ఇలాంటి పరిస్థితులు లేవు. వేరే వాళ్ళ చేతిలోకి మేనేజ్మెంట్ వెళ్ళగానే ఇవన్నీ జరుగుతున్నాయి అని అన్నారు. దీంతో మనోజ్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి దీనిపై మోహన్ బాబు కానీ మంచు విష్ణు కానీ స్పందిస్తారా చూడాలి.