Manchu Vishnu : వెడ్డింగ్ యానివర్సరీకి భార్యని సర్‌ప్రైజ్ చేసిన మంచు విష్ణు.. న్యూజిలాండ్‌కి తీసుకెళ్లి మరీ..

నేడు మంచు విష్ణు - విరానికా 15వ వెడ్డింగ్ యానివర్సరీ. దీంతో విష్ణు తన భార్యకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చాడు.

Manchu Vishnu : వెడ్డింగ్ యానివర్సరీకి భార్యని సర్‌ప్రైజ్ చేసిన మంచు విష్ణు.. న్యూజిలాండ్‌కి తీసుకెళ్లి మరీ..

Manchu Vishnu gives Surprise to his Wife Viranica on their 15th Wedding Anniversary

Updated On : March 1, 2024 / 6:17 PM IST

Manchu Vishnu : మంచు విష్ణు ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా ‘కన్నప్ప'(Kannappa) షూట్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. న్యూజిలాండ్(New Zealand) లో ప్రస్తుతం కన్నప్ప సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. అయితే నేడు మంచు విష్ణు – విరానికా 15వ వెడ్డింగ్ యానివర్సరీ. దీంతో విష్ణు తన భార్యకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చాడు.

విష్ణు తన 15వ పెళ్లి రోజున తన భార్యని కూడా న్యూజిలాండ్ కి తీసుకొచ్చి అక్కడ హెలికాఫ్టర్ ఎక్కించి పై నుంచి న్యూజిలాండ్ ప్రకృతి అందాలని చూపించాడు. హెలికాఫ్టర్ ఎక్కాక భార్యకి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ విషెష్ చెప్పాడు. దీంతో విరానికా ఆశ్చర్యపోయి విష్ణుకి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది.

Also Read : Operation Valentine : వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలంటైన్’.. ఏ ఓటీటీలో? ఎప్పుడు వస్తుంది అంటే..

విరానికా తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. విష్ణుతో హెలికాఫ్టర్ వీడియోని, కొన్ని ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఇలాంటి అద్భుతమైన సర్ ప్రైజ్ ఇచ్చినందుకు థ్యాంక్యూ. అస్సలు ఊహించలేదు, ఇవన్నీ చాలా బాగా ప్లాన్ చేసావు. నీతో ప్రతిరోజు ఒక అడ్వెంచర్ లా ఉంటుంది. హ్యాపీ 15 మై లవ్ అంటూ పోస్ట్ చేసింది. దీంతో విరానికా షేర్ చేసిన వీడియో, ఫోటోలు వైరల్ గా మారాయి. పలువురు అభిమానులు, నెటిజన్లు ఈ జంటకు సోషల్ మీడియా ద్వారా వెడ్డింగ్ యానివర్సరీ విషెష్ తెలియచేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Viranica Manchu (@viranica)