Manchu Vishnu : మంచు విష్ణు ‘కన్నప్ప’ అప్డేట్.. 800 మంది.. 8 భారీ కంటెయినర్స్‌.. న్యూజిలాండ్ కి తరలింపు..

తాజాగా విష్ణు కన్నప్ప సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఈ సినిమాని న్యూజిలాండ్ లో షూటింగ్ చేయబోతున్నట్టు గతంలోనే విష్ణు ప్రకటించారు.

Manchu Vishnu : మంచు విష్ణు ‘కన్నప్ప’ అప్డేట్.. 800 మంది.. 8 భారీ కంటెయినర్స్‌.. న్యూజిలాండ్ కి తరలింపు..

Manchu Vishnu huge preparations for Kannappa Movie Details here

Updated On : September 24, 2023 / 10:07 AM IST

Manchu Vishnu : మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీం ప్రాజెక్టు ‘కన్నప్ప'(Kannappa) ఇటీవల అధికారికంగా పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు (Mohan Babu) నిర్మాణంలో దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో కన్నప్ప సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ప్రభాస్(Prabhas), నయనతార(Nayanthara) కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాని న్యూజిలాండ్ లో షూటింగ్ చేయబోతున్నట్టు గతంలోనే విష్ణు ప్రకటించారు.

తాజాగా విష్ణు కన్నప్ప సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. దాదాపు 800 మంది సిబ్బంది కష్టపడి సినిమాలో కావాల్సిన అన్ని ఐటమ్స్ ని సెట్ వర్క్ పూర్తి చేశారు. పురాణం కాలం నాటి సినిమా కావడంతో అప్పటి కాలానికి తగ్గట్టు ఆయుధాలు, పరికరాలు, ఇంకా అనేక సెట్ ప్రాపర్టీ ఐటమ్స్ తయారు చేశారు. ఇప్పుడు ఈ సెట్ ప్రాపర్టీ అంతా 8 భారీ కంటైనర్లు లో న్యూజిలాండ్ కి తరలిస్తున్నారు. త్వరలోనే న్యూజిలాండ్ లో షూటింగ్ మొదలవ్వనుంది.

Also Read : Raghava Lawrence : కంగనా సెక్యూరిటీపై లారెన్స్ కౌంటర్లు.. పాకిస్థాన్ బోర్డర్ లో ఉన్నామా అంటూ..

ఇంత భారీగా కన్నప్ప ప్రిపరేషన్స్ చూసి కొంతమంది విష్ణు ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు అని అనుకుంటుంటే కొంతమందేమో ఆ షూటింగ్ ఇక్కడి అడవుల్లోని తీసుకోవచ్చు కదా ఇంత ఖర్చుపెట్టి ఇవన్నీ అక్కడికి తీసుకెళ్లడం అవసరమా అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. చూద్దాం మరి విష్ణు కన్నప్ప సినిమాని ఏ రేంజ్ లో తెరకెక్కిస్తాడో.