Kannappa Movie : కన్నప్పలో మలయాళం స్టార్ హీరో.. విష్ణు ఇంకెంతమందిని తీసుకొస్తాడో??
కన్నప్ప సినిమా నుంచి ఇటీవల వరుస అప్డేట్స్ ఇస్తున్నాడు మంచు విష్ణు. ఈ సినిమాలో ప్రభాస్ ఉన్నట్టు ప్రకటించడంతో ప్రభాస్(Prabhas) శివుడి పాత్రలో కనిపించబోతున్నట్టు వార్తలు కూడా వచ్చాయి.

Manchu Vishnu Kannappa Movie Update Malayalam Star Hero playing a Key Role in Kannppa
Kannappa Movie : మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీం ప్రాజెక్టు ‘కన్నప్ప’ ఇటీవల అధికారికంగా పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టాడు. భక్త కన్నప్ప కథతో ‘కన్నప్ప’ అనే టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని మోహన్ బాబు (Mohan Babu) నిర్మించబోతున్నాడు. అవా ఎంటర్టైన్మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకం పై దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్ టెలివిజన్ రంగంలో సూపర్ హిట్ మహాభారత సిరీస్ ని డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఇందులో మంచు విష్ణు టైటిల్ రోల్ చేస్తున్నాడు.
కన్నప్ప సినిమా నుంచి ఇటీవల వరుస అప్డేట్స్ ఇస్తున్నాడు మంచు విష్ణు. ఈ సినిమాలో ప్రభాస్ ఉన్నట్టు ప్రకటించడంతో ప్రభాస్(Prabhas) శివుడి పాత్రలో కనిపించబోతున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. అలాగే ఈ సినిమాలో నయనతార(Nayanthara) కూడా ఓ పాత్రలో కనిపించబోతున్నట్టు సీనియర్ నటి మధుబాల తెలిపింది. ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని న్యూజిలాండ్ లో చేస్తున్నారు. త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే షూటింగ్ కావాల్సిన ప్రాపర్టీ అంతా ఇక్కడే రెడీ చేసి దాదాపు 8 కంటైనర్లలో న్యూజిలాండ్ కి తరలించినట్టు విష్ణు అధికారికంగానే ప్రకటించాడు.
Also Read : Ustaad Bhagat Singh : పవన్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అప్డేట్.. హరీష్ శంకర్ స్పెషల్ పోస్ట్..
దీంతో కన్నప్ప సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెంచేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది. కన్నప్ప సినిమాలో మలయాళం స్టార్ హీరో మోహన్‌లాల్ కూడా ఓ ముఖ్య పాత్రలో నటించబోతున్నట్టు మంచు విష్ణు ప్రకటించారు. మోహన్‌లాల్‌తో మంచు విష్ణు దిగిన ఫోటోని ఓ సినిమా పిఆర్ షేర్ చేసి ఈ విషయాన్ని ప్రకటించగా మంచు విష్ణు దాన్ని రీ షేర్ చేసి కన్ఫర్మ్ చేశారు. గతంలోనే మంచు విష్ణు కన్నప్ప సినిమాలో సౌత్ స్టార్స్ చాలా మంది ఉంటారు అని ప్రకటించాడు. ఇప్పటికే ప్రభాస్, నయనతార, మధుబాల, మోహన్‌లాల్‌లని ప్రకటించగా ఇంకెంతమంది స్టార్స్ ని తీసుకొస్తాడో, చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాడుగా విష్ణు అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
Har Har Mahadev! ❤️ https://t.co/Q62cakbibp
— Vishnu Manchu (@iVishnuManchu) September 30, 2023
In the crafting of 𝐈𝐧𝐝𝐢𝐚𝐧 𝐄𝐩𝐢𝐜 𝐓𝐚𝐥𝐞, the hands of a thousand skilled craftsmen unite!
Get ready to immerse yourself in the world of 👁️#Kannappa
We are excited to kickstart our project! 🎬✨🙏🏻
🎞️Stay tuned for more updates! 🎞️ pic.twitter.com/oVsM3sNryD
— Kannappa The Movie (@kannappamovie) September 22, 2023