Ponnyin Selvan 2 Trailer : పొన్నియిన్ సెల్వన్ 2 ట్రైలర్.. అవే యుద్దాలు.. అదే చోళ వర్సెస్ పాండ్య కథ కొనసాగింపు..

పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాని ఏప్రిల్ 28న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ట్రైలర్ ఈవెంట్ నిర్వహించి పొన్నియిన్ సెల్వన్ 2 ట్రైలర్ ని లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ కి....................

Ponnyin Selvan 2 Trailer : పొన్నియిన్ సెల్వన్ 2 ట్రైలర్.. అవే యుద్దాలు.. అదే చోళ వర్సెస్ పాండ్య కథ కొనసాగింపు..

Maniratnam Ponnyin Selvan 2 Trailer released

Updated On : March 30, 2023 / 12:39 PM IST

Ponnyin Selvan 2 Trailer :  మణిరత్నం(ManiRatnam) దర్శకత్వంలో విక్రమ్(Vikram), కార్తీ(Karthi), జయం రవి(Jayam Ravi), ఐశ్వర్య రాయ్(Aishwarya Rai), త్రిష(Trisha), శోభిత, ఐశ్వర్య లక్ష్మి, జయరాం.. ఇలా అనేకమంది స్టార్ కాస్ట్ తో భారీగా తెరకెక్కించిన సినిమా పొన్నియిన్ సెల్వన్(Ponniyin Selvan). పొన్నియిన్ సెల్వన్ పుస్తకం ఆధారంగా తమిళ రాజుల చరిత్రని చూపిస్తూ గ్రాండ్ గా తీసారు ఈ సినిమాని. సినిమా రిలీజ్ కి ముందు భారీ అంచనాలు ఉన్నాయి. దీన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తామని ప్రకటించి పొన్నియిన్ సెల్వన్ 1 గతేడాది రిలీజ్ చేశారు. ఆ సినిమా తమిళ్ లో హిట్ అయినా మిగిలిన చోట్ల మాత్రం అంత బాగా టాక్ రాలేదు. కానీ దానిపై ఉన్న అంచనాలతో భారీ ఓపెనింగ్స్ వచ్చి టోటల్ రన్ లో దాదాపు పొన్నియిన్ సెల్వన్ 1 సినిమా 400 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది.

ఇక పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాని కూడా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాని ఏప్రిల్ 28న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ట్రైలర్ ఈవెంట్ నిర్వహించి పొన్నియిన్ సెల్వన్ 2 ట్రైలర్ ని లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ కి చిత్రంలో నటించిన స్టార్స్ అందరితో పాటు పలువురు తమిళ సినీ ప్రముఖులు కూడా విచ్చేశారు. పొన్నియిన్ సెల్వన్ 1 సినిమా ప్రమోషన్స్ కి రజినీకాంత్, కమల్ హాసన్ వచ్చి మరీ ఓ రేంజ్ లో ప్రమోట్ చేశారు. తాజాగా పొన్నియిన్ సెల్వన్ 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి కమల్ హాసన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఇక ట్రైలర్ లో.. అన్ని యుద్దాలు, ఒకరిపై ఒకరు పన్నాగాలు, ఎత్తుకు పై ఎత్తులు చూపించారు, చనిపోయాడనుకున్న పొన్నియన్ సెల్వన్ ఎలా బయటకి వచ్చాడు, చోళులు వర్సెస్ పాండ్యుల కథ.. ఇలా మొదటి కథకు కొనసాగింపుగానే ఉండబోతున్నట్టు చూపించారు. ట్రైలర్ మొత్తం కూడా యుద్ధ సన్నివేశాలే ఎక్కువ చూపించారు. పొన్నియిన్ సెల్వన్ 1 కి ఇది కొనసాగింపు కావడంతో అంత ఆసక్తికరంగా అనిపించే అంశాలు ఏమి ట్రైలర్ లో లేవు.

Ram Charan : ది రోర్ ఆఫ్ రామ్.. అదిరిపోయే లుక్స్ తో నేషనల్ మ్యాగజైన్ పై రామ్ చరణ్..

ఇక థియేటర్స్ లో ఈ సినిమా ఏ మాత్రం సందడి చేస్తుందో చూడాలి. పొన్నియిన్ సెల్వన్ 1 ఇక్కడ తెలుగులో అయితే అంత మ్యాజిక్ చేయలేకపోయింది. ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ 2 కూడా తమిళ్ లో హిట్ అయినా తెలుగులో మాత్రం అంత మ్యాజిక్ చేయకపోవచ్చు అనే అనిపిస్తుంది. ఇంకో నెలరోజులు ఆగాల్సిందే పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా చూడటానికి.