Manoj Bajpayee
Manoj Bajpayee: రెబల్‌స్టార్ ప్రభాస్, ‘కె.జి.యఫ్’ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో, హోంబలే ఫిలింస్ బ్యానర్లో ‘కె.జి.యఫ్’ నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘సలార్’.. శృతి హాసన్ కథానాయిక. ఇటీవల రిలీజ్ చేసిన ప్రభాస్ ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
Salaar : ‘సలార్’ లో చిరు..! క్లారిటీ ఇచ్చిన మెగా కాంపౌండ్..
ప్రస్తుతం ప్రభాస్ ‘ఆదిపురుష్’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ప్రశాంత్ నీల్ ‘సలార్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నారు. ఈ సినిమా ‘కె.జి.యఫ్’ కి పది రెట్లు మించి ఉంటుందని ప్రశాంత్ అనౌన్స్ చేసినప్పటి నుండి అంచనాలు ఆకాశాన్నంటాయి.
Adipurush : ఇక్కడి నుంచి ప్రభాస్.. అక్కడి నుంచి కృతి..
ఇదిలా ఉంటే రీసెంట్‌గా ‘సలార్’ మూవీకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ బయటకి వచ్చింది. ఈ సినిమాలో వెర్సటైల్ యాక్టర్ మనోజ్ బాజ్‌పేయి నటిస్తున్నారట. సినిమాలో ఆయనది మెయిన్ విలన్ క్యారెక్టర్ అంటున్నారు. ఇటీవల ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్‌తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్న మనోజ్.. ఇందులోని నటనకు గాను ‘ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ 2021’ బెస్ట్ యాక్టర్‌గా అవార్డ్ విన్ అయ్యారు. ఇప్పుడాయన ‘సలార్’ లో విలన్ వేషం వేస్తున్నారనే వార్త వైరల్ అవుతోంది.